సాహిత్యం: సిరివెన్నెల
పల్లవి:
పల్లవించు తొలిరాగమే సూర్యోదయం
పరవశించు ప్రియగానమే చంద్రోదయం
సరికొత్తగ సాగు ఈపాట
విని గాలులు ఆడే సయ్యాట
ఒక చల్లని తోడు చేయూత
నా పాటల తీగ తొలిపూత
నాలుగు దిక్కులు నా చిరుపాటలు అల్లుకునే సమయం
రెక్కలు విప్పుకు చుక్కలసీమకు సాగెను నా పయనం
పల్లవించు తొలిరాగమే సూర్యోదయం
పరవశించు ప్రియగానమే చంద్రోదయం
చరణం1:
పలికే గుండె వేణువులో స్నేహమే ఊపిరి
కదిలే కలల సరిగమలే పాటలో మాధురి
కలిసినవి కోయిలలెన్నో శ్రోతల వరుసలలో
శిలలైనా చిగురించెను ఆ పల్లవి పలుకులలో
ఇంధ్రధనసు సైతం తనలో రంగులనే
ఇప్పటికిప్పుడు సప్తస్వరాలుగా పలికెను నాతోనే
పల్లవించు తొలిరాగమే సూర్యోదయం
పరవశించు ప్రియగానమే చంద్రోదయం
చరణం2:
బ్రతుకే పాటగా మారి బాటయే మార్చగా
వెతికే వెలుగులోకాలే ఎదురుగా చేరగా
అణువణువు ఎటు వింటున్నా నా స్వరమే పలికే
అడుగడుగున ఆ స్వరములలో సిరులెన్నో చిలికే
ఆలకించెనే కాలం నా ఆలాపననే
పాటల జగతిని ఏలే రాణిగ వెలిగే శుభవేళ
పల్లవించు తొలిరాగమే సూర్యోదయం
పరవశించు ప్రియగానమే చంద్రోదయం
సరికొత్తగ సాగు ఈపాట
విని గాలులు ఆడే సయ్యాట
ఒక చల్లని తోడు చేయూత
నా పాటల తీగ తొలిపూత
నాలుగు దిక్కులు నా చిరుపాటలు అల్లుకునే సమయం
రెక్కలు విప్పుకు చుక్కలసీమకు సాగెను నా పయనం
పల్లవించు తొలిరాగమే సూర్యోదయం
పరవశించు ప్రియగానమే చంద్రోదయం
|
No comments:
Post a Comment