తారాగణం: కె.వి.నాగేశ్వరరావు, గీతాంజలి
గాత్రం: పి.సుశీల
సాహిత్యం: ఆత్రేయ
సంగీతం: కే.వి.మహదేవన్
దర్శకత్వం: సంజీవరావు
సంస్థ: ప్రసాద్ ప్రొడక్షన్స్
విడుదల: 1965
పల్లవి:
మల్లెపువ్వులు విరిసెరా మంచు తెరలు కరిగెరా
నల్లనయ్యా మేలుకో
నల్లనయ్యా మేలుకో చల్లనయ్యా మేలుకో
మల్లెపువ్వులు విరిసెరా మంచు తెరలు కరిగెరా
చరణం1:
పురిటి వెలుగున బుగ్గపై నీ పంటి నొక్కులు కంటిరా
చిరుత నవ్వుల పెదవిపై
చిరుత నవ్వుల పెదవిపై నా కంటి కాటుకలంటెరా
నల్లనయ్యా మేలుకో చల్లనయ్యా మేలుకో
చరణం2:
చిక్కు పడిన కురులు చూసి సిగ్గు ముంచుకు వచ్చెరా
రేయి గడచిన హాయినంతా
రేయి గడచిన హాయినంతా మనసు నెమరు వేసెరా
నల్లనయ్యా మేలుకో చల్లనయ్యా మేలుకో
చరణం3:
నీవు నిండుగ నవ్వినపుడే నాకు నిజముగ తెల్లవారును
నా కాపురాన రేపు మాపులు
కాపురాన రేపు మాపులు కలవురా నీ చూపులోనే
మల్లెపువ్వులు విరిసెరా మంచు తెరలు కరిగెరా
నల్లనయ్యా మేలుకో చల్లనయ్యా మేలుకో
మల్లెపువ్వులు విరిసెరా మంచు తెరలు కరిగెరా
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
No comments:
Post a Comment