Apr 15, 2011

రాము

గాత్రం: ఘంటసాల, సుశీల
సాహిత్యం: ఆరుద్ర



పల్లవి:

పచ్చని చెట్టు ఒకటి
వెచ్చని చిలకలు రెండు

పచ్చని చెట్టు ఒకటి
వెచ్చని చిలకలు రెండు
పాటలు పాడి జోకొట్టాలి జో జో జో

పచ్చని చెట్టు ఒకటి
వెచ్చని చిలకలు రెండు
పాటలు పాడి జోకొట్టాలి జో జో జో
పచ్చని చెట్టు ఒకటి
వెచ్చని చిలకలు రెండు
పాటలు పాడి జోకొట్టాలి జో జో జో

చరణం1:

చల్లని పలుకుల తల్లి
చక్కని నవ్వుల తండ్రి
కమ్మని నోముల పంట నీవే సుమా
చల్లని పలుకుల తల్లి
చక్కని నవ్వుల తండ్రి
కమ్మని నోముల పంట నీవే సుమా
ఇద్దరి బుగ్గల మీదా ముద్దుల మూటలు కడితే
ఇంపుగ నిదుర పోవాలి జో జో జో

పచ్చని చెట్టు ఒకటి
వెచ్చని చిలకలు రెండు
పాటలు పాడి జోకొట్టాలి జో జో జో

చరణం2:

వలపుల చిలక అదిగో
పలకని చిలక ఇదిగో
చిలక రాజు మదిలో సుఖమేది
వలపుల చిలక అదిగో
పలకని చిలక ఇదిగో
చిలక రాజు మదిలో సుఖమేది
దేవతవంటిది తల్లి ఇచ్చిన పెన్నిధి నీవే
జీవించాలి నీకై నా తండ్రి
జీవించాలి నీకై నా తండ్రి

పచ్చని చెట్టు ఒకటి
వెచ్చని చిలకలు రెండు
పాటలు పాడి జోకొట్టాలి జో జో జో
పాటలు పాడి జోకొట్టాలి జో జో జో
పాటలు పాడి జోకొట్టాలి జో జో జో

~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~

3 comments:

Dr.Suryanarayana Vulimiri said...

చాల చక్కని పాట గుర్తు చేసారు. ఈ పాట విషాద-వెర్షన్. దీని సంతోష-వెర్షన్ లో రెండవ చరణం ఇలా వుంటుంది.

చిట్టీ చిలక పలకా
చిలక తల్లి కులకా
చిలక రాజు చెట్ల చాటున వెతకాలి
చల్లగ మురిసె వేళా చాటుగ మసలే వేళా
ఎల్లరు కలకల లాడాలి జో జో జో

ఈ పాటే కాకుండా, మామిడి కొమ్మా మళ్ళీ మళ్ళీ పూయునులే, రారా క్రుష్నయ్యా, మంటలు రేపే నెలరాజా, ఓహ్! అన్నీ అద్భుతమైన పాటలు. ఎపుడో చిన్నప్పుడు చూసిన సినిమా ఇంకా కళ్ల ముందు మెదులుతున్నట్లుంది. ధన్యవాదాలు.

shyam said...

ఈ పాట రాసింది దాశరధిగారు కాదు.ఆరుద్రగారు.సరిచెయ్యగలరు.
శ్యాం

విహారి(KBL) said...

ధన్యవాదాలు తప్పు తెలిపినందుకు.