తారాగణం: అమర్‌నాధ్, శ్రీరంజని, కృష్ణకుమారి
గాత్రం: ఏ.ఎం.రాజా, జిక్కి
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
నిర్మాతలు: పి.గోపాలరెడ్డి, పి.ఏ.పద్మనాభరావు
దర్శకత్వం: సార్వభౌమ, అమనుతుల్లా
సంస్థ: శర్వాణి
విడుదల: 1957
పల్లవి:
అంటు మామిడి తోటలోన ఒంటరిగా పోతుంటే
కొంటెచూపు చూసేటి మావయా
నీ కంటిచూపు కథలు తెలుసు లేవయా
అంటు మామిడి తోటలోన ఒంటరిగా పోతుంటే
కొంటెచూపు చూసేటి మావయా
నీ కంటిచూపు కథలు తెలుసు లేవయా
చరణం1:
గున్న మావి పళ్ళు కోయు పిల్లదానా
గున్న మావి పళ్ళు కోయు పిల్లదానా
నీ వన్నె మీద మనసాయె చిన్నదానా
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
కోరచూపు చూడకే కుర్రదానా
ఆ అహా
కోరచూపు చూడకే కుర్రదానా
నీ కోరచూపు బాసయ్యే గుండెలోన
అంటుమామిడి తోటలోన
కంటికింపు కాకుండా ఒంటరిగా ఉంటేను ఎలా
ఇక జంటగానే ఉండాలే పిల్ల
చరణం2:
మోటబావి నీరు తాగు చిన్నవాడా
నా బాట కట్టి రాబోకు వన్నెకాడా
మోటబావి గట్టు పక్క, నిమ్మచెట్టు నీడ కింద
మోటబావి గట్టు పక్క, నిమ్మచెట్టు నీడ కింద
మోటు సరసమేల చాలు నిలు నిలు నీటుగాడా
అంటు మామిడి తోటలోన ఒంటరిగా పోతుంటే
కొంటెచూపు చూసేటి మావయా
నీ కంటిచూపు కథలు తెలుసు లేవయా
ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ
గళ్ళ చీర కట్టుకుని
కళ్ళ కాటుకెట్టుకొని
గుళ్ళ పేరు వేసుకొని
ఘల్లుఘల్లని పోతుంటే
ఒళ్ళంతా కళ్ళు చేసుకొని చూడొచ్చా
నా కళ్ళ సంకెల్లు నీకు వెయ్యొచ్చా
చిలకాగోరింకలల్లే చెట్టాపట్టాలేసుకొని
కలసి మెలసి ఉంటేనే హాయి
ఇలా కులుకుతూ ఉంటేనే హాయి
~~~~~~~~~~~~~~~~~~~~~~
~~~~~~~~~~~~~~~~~~~~~~
No comments:
Post a Comment