Jul 4, 2011

ఖుషి

గాత్రం: ఉదిత్ నారాయణ, కవిత కృష్ణమూర్తి
సాహిత్యం: చంద్రబోస్



పల్లవి:

అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా
మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే
అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా
మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే
అబ్బాయే సూటిగా కన్నెత్తి చూడగా
ఆ వాడి చూపులకు మంచైన మరిగేలే
ఆ నవ్వులు హొ హొ
ఈ చూపులు హొ హొ
ఆ నవ్వులు ఈ చూపులు కలిపిస్తే ప్రేమేలే
అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా
మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే

చరణం1:

ప్రేమలు పుట్టే వేళ పగలంతా రేయ్యేలే...అమ్మమ్మో
ప్రేమలు పండే వేళ జగమంతా జాతరలే...అమ్మమ్మో
ప్రేమే తోడుంటే పామైనా తాడేలే
ప్రేమే వెంటుంటే రాయైనా పరుపేలే
నీ ఒంట్లో ముచ్చెమటైనా నా పాలిట పన్నీరే
నువ్విచ్చే పచ్చిమిరపైనా నా నోటికి నారింజే
ఈ వయసులో హొ హొ
ఈ వరసలో హొ హొ
ఈ వయసులో ఈ వరసలో నిప్పైనా నీరేలే

అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా
మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే

చరణం2:

నేనొక పుస్తకమైతే నీ రూపే ముఖ చిత్రం
నేనొక అక్షరమైతే నువ్వేలే దానర్ధం
ఎగిరే నీ పైటే కలిగించే సంచలనం
ఒలికే నీ వలపే చేయించే తలస్నానం
ఎండల్లో నీరెండల్లో నీ చెలిమే చలివేంద్రం
మంచుల్లో పొగ మంచుల్లో నీ తలపే రవికిరణం
పులకింతలే మొలకెత్తగా హొ హొ
పులకింతలే మొలకెత్తగా ఇది వలపుల వ్యవసాయం

అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా
మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే
అబ్బాయే సూటిగా కన్నెత్తి చూడగా
ఆ వాడి చూపులకు మంచైన మరిగేలే
ఆ నవ్వులు హొ హొ
ఈ చూపులు హొ హొ
ఆ నవ్వులు ఈ చూపులు కలిపిస్తే ప్రేమేలే

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

No comments: