Jul 15, 2011

గోదావరి

తారాగణం: సుమంత్,కమలిని ముఖర్జి,కమల్ కామరాజ్,నీతుచంద్ర
గాత్రం: బాలు
సాహిత్యం: వేటూరి
సంగీతం: కె.ఎం.రాధాకృష్ణ
దర్శకత్వం: శేఖర్ కమ్ముల
నిర్మాత: జి.వి.జి.రాజు
విడుదల: 2006




పల్లవి:

షడ్జమాం భవతి వేదం
పంచమాం భవతి నాదం
శృతిశిఖరే నిగమఝరే స్వరలహరే

ఉప్పొంగెలే గోదావరి ఊగిందిలే చేలో వరి
భూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరి
వెతలు తీర్చు మా దేవేరి వేదమంటి మా గోదారి
శబరి కలిసిన గోదారి రామచరితకే పూదారి
ఏసెయ్ చాప జోర్సేయ్ నావ బార్సేయ్ వాలుగా
చుక్కానే చూపుగా బ్రతుకు తెరువు ఎదురీతేగా
ఉప్పొంగెలే గోదావరి ఊగిందిలే చేలో వరి
భూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరి

చరణం1:

సావాసాలు సంసారాలు చిలిపి చిలక జోస్యం
వేసే అట్లు వెయ్యంగానె లాభసాటి బేరం
ఇళ్ళే ఓడలైపోతున్న ఇంటి పనుల దృశ్యం
ఆరేసేటి అందాలన్ని అడిగే నీటి అద్దం
ఏం తగ్గింది మా రామయ్య భోగం ఇక్కడ
నది ఊరేగింపులో పడవ మీద రాగా ప్రభువు తాను కాదా

ఉప్పొంగెలే గోదావరి ఊగిందిలే చేలో వరి
భూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరి

చరణం2:

గోదారమ్మ కుంకంబొట్టు దిద్దె మిరప ఎరుపు
లంకానాధుడింకా ఆగనంటు పండు కొరుకు
చూసే చూపు ఏం చెప్పింది సీతాకాంతకి
సందేహాల మబ్బే పట్టె చూసే కంటికి
లోకం కాని లోకంలోన ఏకాంతాల వలపు
అల పాపికొండలా నలుపు కడగలేక నవ్వు తనకు రాగా

ఉప్పొంగెలే గోదావరి ఊగిందిలే చేలో వరి
భూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరి
వెతలు తీర్చు మా దేవేరి వేదమంటి మా గోదారి
శబరి కలిసిన గోదారి రామ చరితకే పూదారి
ఏసెయ్ చాప జోర్సేయ్ నావ బార్సేయ్ వాలుగా
చుక్కానే చూపుగా బ్రతుకు తెరువు ఎదురీతేగా

ఉప్పొంగెలే గోదావరి ఊగిందిలే చేలో వరి
భూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

1 comment:

రసజ్ఞ said...

నాకు బాగా నచ్చిన పాటలలో ఇది ఒకటి. మంచి పాట.