గాత్రం: ఘంటసాల
సాహిత్యం: ఆత్రేయ
సంగీతం: కె.వి.మహదేవన్
దర్శకత్వం: వి.మధుసూధనరావు
నిర్మాత:వి.బి.రాజేంద్రప్రసాద్
సంస్థ:జగపతి పిక్చర్స్
విడుదల :నవంబర్ 18,1966
పల్లవి :
చిట్టి అమ్మలూ చిన్ని నాన్నలూ
మన ఇద్దరికే తెలుసు ఈ మమతలు
చిట్టి అమ్మలూ చిన్ని నాన్నలూ
మన ఇద్దరికే తెలుసు ఈ మమతలు
చిట్టి అమ్మలూ
చరణం1:
ఎవరికెవరు వేశారు బంధము
ఒకొరికొకరమైనాము ప్రాణము
ఎవరికెవరు వేశారు బంధము
ఒకొరికొకరమైనాము ప్రాణము
నీకు నేను అమ్మనూ నాన్ననూ
నీకు నేను అమ్మనూ నాన్ననూ
నాకు నీవే లోకాన సర్వమూ
నాకు నీవే లోకాన సర్వమూ
చిట్టి అమ్మలూ చిన్ని నాన్నలూ
మన ఇద్దరికే తెలుసు ఈ మమతలు
చిట్టి అమ్మలూ
చరణం2:
కన్న కడుపు తీయదనం కన్న
నీకు అన్న ఒడి వెచ్చదనం మిన్న
కన్న కడుపు తీయదనం కన్న
నీకు అన్న ఒడి వెచ్చదనం మిన్న
పదినాళ్ల పాపగానే ఒదిగావు
పదినాళ్ల పాపగానే ఒదిగావు
హృదయమే ఊయలగా ఊగావు
హృదయమే ఊయలగా ఊగావు
చిట్టి అమ్మలూ చిన్ని నాన్నలూ
మన ఇద్దరికే తెలుసు ఈ మమతలు
చిట్టి అమ్మలూ
|
No comments:
Post a Comment