గాత్రం: దేవన్, కల్పన
సాహిత్యం: ఏ.ఎం.రత్నం
పల్లవి:
ప్రేమంటే సులువు కాదురా అది నీవు గెలవలేవురా
ప్రేమించే షరుతులేమిటటో అందులోని మర్మమేమిటో
ప్రేమెంతో విలువ అయినది అందరికి దొరకలేనిది
చూసేందుకు చక్కనైనది తాకావో భగ్గుమంటది
నో నో నో అలా చెప్పకు మనసుంటే మార్గముంటది
సయ్యంటే చేసి చూపుతా లోకానికి చాటి చెప్పుతా

చరణం1:
జాబిల్లి బొమ్మగ చేసిస్తావా
భూలోకం చుట్టి సిగలో తురిమేస్తావా
మబ్బుల్లో మల్లెల పరుపేస్తావా
ఆకాశం దిండుగ మర్చేస్తావా
తెస్తావా తెస్తావా తెస్తావా
సూర్యుడ్నే పట్టి తెచ్చెదా
నీ నుదుటన బొట్టు పెట్టెదా
చుక్కలతో చీర కట్టెదా
మెరుపులతో కాటుకెట్టెదా
చరణం2:
తాజ్‌మహలే నువ్వు కట్టిస్తావా
నా కోసం నయాగరా జలపాతం తెస్తావా
ఎవరెస్ట్ శిఖరమెక్కిస్తావా
ఫసిఫిక్కు సాగరమీదేస్తావా
వస్తావా తెస్తావా తెస్తావా
స్వర్గానే సృష్టి చేసేదా
నీ ప్రేమకు కానుకిచ్చెదా
కైలాసం భువికి దించెదా
నా ప్రేమను రుజువు చేసేదా
ప్రేమంటే సులువు కాదురా అది నీవు గెలవలేవురా
ప్రేమించే షరుతులేమిటటో అందులోని మర్మమేమిటో
ప్రేమెంతో విలువ అయినది అందరికి దొరకలేనిది
చూసేందుకు చక్కనైనది తాకావో భగ్గుమంటది
నో నో నో అలా చెప్పకు మనసుంటే మార్గముంటది
సయ్యంటే చేసి చూపుతా లోకానికి చాటి చెప్పుతా
~~~~~~~~~~~~~~~~~~~~~~
~~~~~~~~~~~~~~~~~~~~~~
No comments:
Post a Comment