తారాగణం: జి.వరలక్ష్మి,నాగేశ్వరరావు,రాజసులోచన(తొలి చిత్రం)
గాత్రం: ఏ.ఎం.రాజా, సుశీల(తొలి పాట)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
నిర్మాత & దర్శకుడు: ప్రకాశరావు
సంస్థ: ప్రకాష్ ప్రొడక్షన్స్
విడుదల: 1953
పల్లవి:
ఎందుకో పిలిచావెందుకో
ఎందుకో పిలిచావెందుకో
ఈల వేసి సైగ చేసి
ఏమి అసలెరుగనట్లు
ముంగిలాగ మూతి ముడిచి
మూగనోము పట్టావే
ఎందుకో పిలిచావెందుకో
ఎందుకో చెబుతానెందుకో
కన్నతల్లి కన్నుగప్పి
కడవ సంకనేసుకొని
మంచినీళ్ళ పేరు చెప్పి
పొంచి పొంచి వచ్చావే
ఎందుకో చెబుతానెందుకో
ఎందుకో చెబుతానెందుకో
చరణం1:
ఓ ఓ ఓ ఓ ఓ ఓ
ఓ ఓ ఓ ఓ ఓ ఓ
చదువు సాము కట్టిపెట్టి
చల్లగాలి సాకు చెప్పి
ఆటలతో పాటలతో తోటలంట తిరిగావే
ఎందుకో పిలిచావెందుకో
చరణం2:
చల్లని నీ చూపులోనే
చదువంతా నిండిపోయి
వింతలేవో చెబుతావని
చెంతకి రమ్మన్నానే
ఎందుకో చెబుతానెందుకో
చరణం3:
ఐతే ఈ పొడుపుకథ చెప్పుకో చూద్దాం
నీతో ఉంటుంది కాని చేతిలోనికి రానిదేమి
వేలు అనుకొన్నావేమో కాదు
నాతో ఉండేది నీవె చేతిలోనె చిక్కావే
ఇందుకే పిలిచానిందుకే
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
No comments:
Post a Comment