Aug 12, 2011

ఖుషి

తారాగణం: పవన్ కళ్యాణ్, భూమిక
గాత్రం: శ్రీనివాస్, హరిణి
సాహిత్యం: ఏ.ఎం.రత్నం
సంగీతం: మణిశర్మ
దర్శకత్వం: ఎస్.జె.సూర్య
నిర్మాత: ఏ.ఎం.రత్నం
సంస్థ: సూర్యా మూవీస్
విడుదల: 2001



పల్లవి:

చెలియ చెలియా చిరు కోపమా
చాలయ్య చాలయ్య పరిహాసము
కోపాలు తాపాలు మనకేలా
సరదాగా కాలాన్ని గడపాల
సలహాలు కలహాలు మనకేలా
ప్రేమంటే పదిలంగా వుండాల
చెలియ చెలియా చిరు కోపమా
చాలయ్య చాలయ్య పరిహాసము

చరణం1:

రెమ్మల్లో మొగ్గ నే పూయను పొమ్మంటే
గాలి తాకంగ పూచెనులే
అయితే గాలే గెలిచిందననా లేక పువ్వే ఓడిందననా
రాళ్ళల్లో శిల్పం లో లోపల దాగున్న
ఉలి తాకంగ వేలిసెనులే
అయితే ఉలియే గెలిచిందననా లేక శిల్పం ఓడిందననా
ఈ వివరం తెలిపేది ఎవరంట
వ్యవహారం తీర్చేది ఎవరంట
కళ్ళల్లో కదిలేటి కలలంట
ఊహల్లో ఊగేటి ఊసంట
చెలియ చెలియా..చెలియ చెలియా
చిరు కోపమా

చరణం2:

నీలిమేఘాలు చిరుగాలిని ఢీకొంటే
మబ్బు వానల్లే మారునులే
దీన్ని గొడవేననుకోమననా లేక నైజం అనుకోనా
మౌనరాగాలు రెండు కళ్ళను ఢీకొంటే
ప్రేమ వాగల్లే పొంగునులే
దీన్ని ప్రళయం అనుకోమననా లేక ప్రణయం అనుకోనా
ఈ వివరం తెలిపేది ఎవరంట
వ్యవహారం తీర్చేది ఎవరంట
అధరాలు చెప్పేటి కధలంట
హృదయంలో మేదిలేటి వలపంట

చెలియ చెలియా చిరు కోపమా
చాలయ్య చాలయ్య పరిహాసము

~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~

No comments: