Aug 22, 2011

దశావతారం

తారాగణం: కమల్‌హాసన్,అసిన్,మల్లికా షెరావత్,జయప్రద
గాత్రం: సాధనా సర్గం
సాహిత్యం: వేటూరి
సంగీతం: హిమేష్ రేషమ్మియా
దర్శకత్వం: కె.ఎస్.రవికుమార్
నిర్మాత: ఆస్కార్ వి.రవిచంద్రన్
సంస్థ: ఆస్కార్ ఫిలింస్
విడుదల: 2008





పల్లవి:

ముకుందా ముకుందా కృష్ణా ముకుందా ముకుందా
స్వరంలో తరంగా బృందా వనంలో వరంగా
ముకుందా ముకుందా కృష్ణా ముకుందా ముకుందా
స్వరంలో తరంగా బృందా వనంలో వరంగా

వెన్నదొంగవైనా మన్ను తింటివా
కన్నె గుండె ప్రేమ లయల మృదంగానివా
ముకుందా ముకుందా కృష్ణా ముకుందా ముకుందా
స్వరంలో తరంగా బృందా వనంలో వరంగా

జీవకోటి నీ చేతి తోలు బొమ్మలే
నిన్ను తలచి ఆటలాడే కీలు బొమ్మలే
ముకుందా ముకుందా కృష్ణా ముకుందా ముకుందా
స్వరంలో తరంగా బృందా వనంలో వరంగా

చరణం1:

నీలాల నింగి కింద తేలియాడు భూమి
తనలోనే చూపించాడు ఈ కృష్ణ స్వామి
పడగ విప్పి మడుగున లేచే సర్ప శేషమే ఎక్కి
నాట్యమాడి కాళీయుని దర్పమనిచాడు
నీ ధ్యానం చేయు వేళ విజ్ఞానమేగా
అజ్ఞానం రూపుమాపే కృష్ణతత్వమేగా
అట అర్జునుడొందెను నీ దయ వల్ల గీతోపదేశం
జగతికిసైతం ప్రాణం పోసే మంత్రోపదేశం
వేదాల సారమంతా వాసుదేవుడే
రేపల్లే రాగం తానం రాజీవుడే

ముకుందా ముకుందా కృష్ణా ముకుందా ముకుందా
స్వరంలో తరంగా బృందా వనంలో వరంగా

చరణం2:

మత్స్యమల్లే నీటిన తేలి వేదములను కాచి
కూర్మ రూప ధారివి నీవై భువిని మోసినావే
వామనుడై పాదమునెత్తి నింగి కొలిచినావే
నరసింహుని అంశే నీవై హిరణ్యుని చీల్చావు
రావణుని తలలను కూల్చి రాముడివై నిలిచావు
కృష్ణుడల్లే వేణువూది ప్రేమను పంచావు
ఇక నీ అవతారాలన్నెనున్న ఆధారం నేనే
నీ ఒరవడి పట్ట ముడిపడి ఉంటా ఏదేమైనా నేనే
మదిలోని ప్రేమ నీదే మాధవుడా
మందార పువ్వే నేను మనువాడరా

ముకుందా ముకుందా కృష్ణా ముకుందా ముకుందా
స్వరంలో తరంగా బృందా వనంలో వరంగా
ముకుందా ముకుందా కృష్ణా ముకుందా ముకుందా
స్వరంలో తరంగా బృందా వనంలో వరంగా

~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~

2 comments:

Dr.Suryanarayana Vulimiri said...

నమస్కారం. నేను మీ బ్లాగు చాల రోజులయి చూస్తున్నాను. చాల మంచి పాటలు అందిస్తున్నారు. మీ కృషి, అభిరుచి ప్రశంసనీయం. అయితే "ఫాంటు" కొద్దిగ పెద్దది చేస్తే చాల బాగుంటుంది. ప్రస్తుతం ఉన్న పరిమాణం లో చదవడం కొంచెం కష్టంగా వుంది.

విహారి(KBL) said...

font size marchanandi.