Sep 5, 2011

చల్లని నీడ

గాత్రం: జానకి



పల్లవి:

మల్లెల కన్నా జాబిల్లి కన్నా
మల్లెల కన్నా జాబిల్లి కన్నా
చల్లని పాపాయి లాలీజో
చల్లని పాపాయి లాలీజో

చరణం1:

లోకాలు నిదురుంచు వేళాయెరా
కలలందు విహరించ రావేలరా
లోకాలు నిదురుంచు వేళాయెరా
కలలందు విహరించ రావేలరా
తారలతో ఆడుకోవాలిరా
మేఘాలలో తేలిపోవాలిరా

మల్లెల కన్నా జాబిల్లి కన్నా
చల్లని పాపాయి లాలీజో
చల్లని పాపాయి లాలీజో

చరణం2:

అందాలు చిందించు నీ మోమున
కస్తూరి తిలకమ్ము తీర్చేనురా
అందాలు చిందించు నీ మోమున
కస్తూరి తిలకమ్ము తీర్చేనురా
నీ మీద ఏ నీడ పడబోదురా
ఏ గాలి ఏ ధూళి రాబోదురా

మల్లెల కన్నా జాబిల్లి కన్నా
చల్లని పాపాయి రావోయి
చల్లని పాపాయి రావోయి

నీ వారు లేరన్న భయమేలరా
నేనుండగా నీకు లోటేమిరా
నీ వారు లేరన్న భయమేలరా
నేనుండగా నీకు లోటేమిరా
కన్నులలో దాచుకుంటానురా
కనుపాపలా చూచుకుంటానురా

మల్లెల కన్నా జాబిల్లి కన్నా
చల్లని పాపాయి రావోయి
చల్లని పాపాయి రావోయి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

No comments: