తారాగణం: రాజేంద్రప్రసాద్,చంద్రమోహన్,సుమలత,అవంతి
గాత్రం: బాలు,సుశీల
సాహిత్యం: జొన్నవిత్తుల
సంగీతం: రాజ్-కోటి
దర్శకత్వం: జంధ్యాల
నిర్మాత: జి.వి.హెచ్.ప్రసాద్
సంస్థ: సుదర్శన్ పిక్చర్స్
విడుదల: 1990
పల్లవి:
అభిమతమో అభినయమో ఈ ప్రేమ చతురాతి చతురం
అభిమతమో అభినయమో ఈ ప్రేమ చతురాతి చతురం
చలిలో రేగును సెగలే,ఎదలో మోగును లయలే
ఇది పెళ్లికి పిచ్చికి నడుమ విచిత్రం
మధుకలశం హిమశకలం మన చెలిమి మధురాతి మధురం
మధుకలశం హిమశకలం మన చెలిమి మధురాతి మధురం
మనసే మమతకు జోడై,మమతే మనిషికి నీడై
ఇటు సాగిన స్నేహమె మైత్రికి అందం
అభిమతమో అభినయమో ఈ ప్రేమ చతురాతి చతురం
ఓ ఓ ఓ మధుకలశం హిమశకలం మన చెలిమి మధురాతి మధురం
చరణం1:
కోటినవ్వుల గూటిగువ్వవు
గోట మీటగానే మోగు వీణవు
కోమలి కో అంటే ఆరును ఎదమంట
భామిని నో అంటే బాధలు మొదలంట
సరి అనవా వరమిడవా
సరసన నవరసమధురసమీవా
మధుకలశం హిమశకలం మన చెలిమి మధురాతి మధురం
ఓ ఓ ఓ అభిమతమో అభినయమో ఈ ప్రేమ చతురాతి చతురం
చరణం2:
మండుటెండలో మంచుకొండవై
స్నేహసుధలలోన భాగమందుకో
ఒంటరి మనుగడలో ఊరట కలిమేలే
బాధల సుడివడిలో బాసట బలిమేలే
వేడుకలో వేదనలో తోడుగ నిలిచెడి స్నేహమె సంపద
అభిమతమో అభినయమో ఈ ప్రేమ చతురాతి చతురం
ఓ ఓ ఓ మధుకలశం హిమశకలం మన చెలిమి మధురాతి మధురం
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
No comments:
Post a Comment