Jan 26, 2012

బామ్మ మాట బంగారు బాట

తారాగణం: భానుమతి, రాజేంద్రప్రసాద్,నూతన్‌ప్రసాద్,గౌతమి,స్మిత
గాత్రం: భానుమతి
సాహిత్యం: వేటూరి
సంగీతం: చంద్రబోస్
నిర్మాతలు: ఎం.ఎస్.గుహన్,ఎం.శరవణన్,ఎం.బాలసుబ్రమణియన్
దర్శకత్వం: రాజశేఖర్
సంస్థ: ఏ.వి.ఎం
విడుదల: 1990

పల్లవి:

ఢిల్లీకి రాజాకైనా బామ్మ మాట బంగారు బాట
హైక్లాసు చదువులు ఉన్నా బామ్మ మాట బంగారు బాట
పైపై మెరుగుల భామలకన్నా బామ్మలు ఎంతో మెరుగంట
ఢిల్లీకి రాజాకైనా బామ్మ మాట బంగారు బాట
హైక్లాసు చదువులు ఉన్నా బామ్మ మాట బంగారు బాట

చరణం1:

బలగమున్నా పార్టీలున్నా వెలగబెట్టే పదవులు ఉన్నా
బామ్మ మాటే వినమంటా
మధువు పంచే మగువే ఉన్నా కరువు తీరే కలిమే ఉన్నా
బామ్మ మాటే వినమంటా
ఓ నాటి పోతన్న ఆనాటి వేమన్న
ఓ నాటి పోతన్న ఆనాటి వేమన్న
ఉంటే బ్రతికుంటే ఈ మాటే పలికేరంట

ఢిల్లీకి రాజాకైనా బామ్మ మాట బంగారు బాట
హైక్లాసు చదువులు ఉన్నా బామ్మ మాట బంగారు బాట

చరణం2:

కట్నకానుకలిచ్చేవేళ కన్నెనింటికి తెచ్చే వేళ
బామ్మ మాటే వినమంటా
ఇల్లు వాకిలి కట్టే వేళ అప్పుసొప్పు చేసే వేళ
బామ్మ మాటే వినమంటా
కన్నీటి పాటైనా కంచెర్ల గోపన్న
ఉంటే బ్రతికుంటే ఈ మాటే పలికేనంట

ఢిల్లీకి రాజాకైనా బామ్మ మాట బంగారు బాట
హైక్లాసు చదువులు ఉన్నా బామ్మ మాట బంగారు బాట

చరణం3:

ఏ బినామీ భూములు ఉన్నా స్విస్సు బ్యాంకులొ సొమ్ములు ఉన్నా
బామ్మ మాటే వినమంటా
చట్టసభలో తన్నులు తిన్నా పిట్ట కథలో దెబ్బలు తిన్నా
బామ్మ మాటే వినమంటా
వినరా ఓ తెలుగోడా ఘనుడైన గురజాడ
ఉంటే బ్రతికుంటే ఈ మాటే పలికేనంట

ఢిల్లీకి రాజాకైనా బామ్మ మాట బంగారు బాట
హైక్లాసు చదువులు ఉన్నా బామ్మ మాట బంగారు బాట

ఢిల్లీకి రాజాకైనా బామ్మ మాట బంగారు బాట
హైక్లాసు చదువులు ఉన్నా బామ్మ మాట బంగారు బాట
పైపై మెరుగుల భామలకన్నా బామ్మలు ఎంతో మెరుగంట
ఢిల్లీకి రాజాకైనా బామ్మ మాట బంగారు బాట
హైక్లాసు చదువులు ఉన్నా బామ్మ మాట బంగారు బాట

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

No comments: