Mar 8, 2012

ఒక్కడు

గాత్రం: శ్రేయాఘోషల్
సాహిత్యం: సీతారామశాస్త్రి

పల్లవి:

నువ్వేం మాయ చేశావోగాని ఓ మనసా చెప్పమ్మా నిజాన్ని
క్షణం ఆగనంటోంది ఓణి మరీ చిలిపిదీ వయసు బాణీ
హయ్యా హయ్యారే హయ్యారే హయ్యా చిందులేస్తున్న ఈ అల్లరి
ఓ సయ్యా సయ్యారే సయ్యారే సయ్యా ఎటు పోతుందో ఏమో మరి
నువ్వేం మాయ చేశావోగాని ఓ మనసా చెప్పమ్మా నిజాన్ని
క్షణం ఆగనంటోంది ఓణి మరీ చిలిపిదీ వయసు బాణీ

చరణం1:

ఔరా పంచకల్యాణి పైన వస్తాడంటా యువరాజు అవునా
నువ్వేమైనా చూశావా మైనా తెస్తున్నాడా ముత్యాల మేనా
హయ్యా హయ్యారే హయ్యారే హయ్యా మొగలి పువ్వంటి మొగుడెవ్వరే
ఓ సయ్యా సయ్యారే సయ్యారే సయ్యా మేళ తాళాల మనువెప్పుడే
ఔరా పంచకల్యాణి పైన వస్తాడంటా యువరాజు అవునా
నువ్వేమైనా చూశావా మైనా తెస్తున్నాడా ముత్యాల మేనా

చరణం2:

అలా నువ్వు ఏ చాటునున్నా అలా ఎంత కవ్వించుతున్నా
ఇలా నిన్ను వెంటాడి రానా ఎలాగైనా నిన్ను కలుసుకోనా
హయ్యా హయ్యారే హయ్యారే హయ్యా ఆశ పడుతున్న ఈ నా మది
ఓ సయ్యా సయ్యారే సయ్యారే సయ్యా అది తీరేది ఎప్పుడన్నది

నువ్వేం మాయ చేశావోగాని ఓ మనసా చెప్పమ్మా నిజాన్ని
క్షణం ఆగనంటోంది ఓణి మరీ చిలిపిదీ వయసు బాణీ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

~~~~~~~~~~~~~~~~~~~~~~~~

No comments: