Mar 15, 2012

దేవిపుత్రుడు

గాత్రం: ఉదిత్‌నారాయణన్, సుజత
సాహిత్యం: జొన్నవిత్తుల



పల్లవి:

తెల్లతెల్లాని చీర జారుతున్నది సందెవేళ
తెల్లతెల్లారే దాకా చెయ్యమన్నాది కుంభమేళ
తాకితే సీతార శృంగార శుక్ర తార
నడుము ఏక్ తార కసి పదనిస పలికేరా
తెల్లతెల్లాని చీర జారుతున్నది సందెవేళ
తెల్లతెల్లారే దాకా చెయ్యమన్నాది కుంభమేళ

చరణం1:

ప్రేమ గురువా ఊగ రావా పూల పొద ఉయ్యాల
హంస లలనా చేరుకోనా కోరికల తీరాన
గొడవే నిరంతరం ఇరువురి దరువే సగం సగం
పిలుపే ప్రియం ప్రియం థకధిమి తపనే తళాన్గు తోం తోం తోం
ఇంధ్ర ధనుసు మంచం ఇమ్మంది వయసు లంచం
పిల్ల నెమలి పింఛం అది అడిగేను మరి కొంచెం

తెల్లతెల్లారే దాకా చెయ్యమన్నాది కుంభమేళ
తెల్లతెల్లాని చీర జారుతున్నది సందెవేళ

చరణం2:

ప్రియ వనితా చీర మడత చక్క చేసి ఒక్కటవ్వనా
మీద పడనా మీగడవనా కన్నె ఎద రాగాలా
రగిలే గులాబివే మదనుడి సభకే జవాబువే
తగిలే సుఖానివే బిగువుల బరిలో విహారివే
శోభనాల బాలా ముందుంది ఇంక చాలా
జాజులా మజాలా పూగంధం పూయాలా

తెల్లతెల్లాని చీర జారుతున్నది సందెవేళ
తెల్లతెల్లారే దాకా చెయ్యమన్నాది కుంభమేళ
తాకితే సీతార శృంగార శుక్ర తార
నడుము ఏక్ తార కసి పదనిస పలికేరా

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

No comments: