Dec 10, 2012

బ్రహ్మ

తారాగణం: మోహన్‌బాబు, శిల్పా శిరోద్కర్, ఐశ్వర్య
గాత్రం: కె.జె.ఏసుదాసు
సాహిత్యం: గురుచరణ్
సంగీతం: బప్పీలహరి
దర్శకత్వం: బి.గోపాల్
నిర్మాత: మోహన్‌బాబు
సంస్థ: శ్రీలక్ష్మిప్రసన్న పిక్చర్స్
విడుదల: 1992


పల్లవి:

ముసి ముసి నవ్వులలోన కురిసిన పువ్వుల వాన
ముసి ముసి నవ్వులలోన కురిసిన పువ్వుల వాన
ఏ నోము నోచినా ఏ పూజ చేసినా తెలిసి ఫలితమొసగేవాడు
బ్రహ్మ ఒక్కడే పరబ్రహ్మ ఒక్కడే
ముసి ముసి నవ్వులలోన కురిసిన పువ్వుల వాన

చరణం1:

ఆరేళ్ళ పాప కోసం ఆనాడు పాడినా
అపరంజి బొమ్మకోసం ఈనాడు పాడినా
అభిమానమున్నవాణ్ణి అవమాన పరచినా
ఎదలోని చీకటంతా వెన్నెలగ మార్చినా
బ్రహ్మ ఒక్కడే పరబ్రహ్మ ఒక్కడే
ముసి ముసి నవ్వులలోన కురిసిన పువ్వుల వాన

చరణం2:

అనురాగ జీవితాన పెనుగాలి రేగినా
తనవారు కానరాక కనుపాప ఏడ్చినా
కడగళ్ళ బ్రతుకులోన వడగళ్ళు రాల్చినా
సుడిగుండమైన నావ ఏ దరికి చేర్చినా
బ్రహ్మ ఒక్కడే పరబ్రహ్మ ఒక్కడే
ముసి ముసి నవ్వులలోన కురిసిన పువ్వుల వాన
ముసి ముసి నవ్వులలోన కురిసిన పువ్వుల వాన
ఏ నోము నోచినా ఏ పూజ చేసినా తెలిసి ఫలితమొసగేవాడు
బ్రహ్మ ఒక్కడే పరబ్రహ్మ ఒక్కడే

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

No comments: