Apr 11, 2013

మనసులో మాట


గాత్రం: చిత్ర, ఉన్నికృష్ణన్


పల్లవి:

చుక్కను చేర నెలవంకొచ్చే
చిలకను చేర గోరింకొచ్చే
ఏం కావాలో ఇంకేం చెయ్యాలో
నింగికి నేల నిచ్చెన వేసే
ఊరికి ఏరే వంతెన వేసే
ఏం చెయ్యాలో ఇంకేం చెయ్యాలో

హోయ్ హోయ్ హోయ్ హోయ్ గాలి ఈల వేసే
అమ్మా హోయ్ హోయ్ హోయ్ హోయ్ పైట పాట పాడే
హోయ్ హోయ్ హోయ్ హోయ్ పాలపిట్ట కూసే
హల్లో హోయ్ హోయ్ హోయ్ హోయ్ కన్ను కాయకాసే
నా ఈడు విసిరింది నాకే సవాలు
ఊహల్లో జరిగాయిలే ఉత్సవాలు
తాంబూలాల పొద్దుల్లో తానేం తెస్తాడో
కన్నె చూపు చుక్క చుట్టాలయ్యే సాయంత్రాలో

హోయ్ హోయ్ హోయ్ హోయ్ గాలి ఈల వేసే
అమ్మా హోయ్ హోయ్ హోయ్ హోయ్ పైట పాట పాడే

చరణం1:

ధీంధినకుధింత ధినకు ధినకు తక ధీంధినకుధింత ధినకు ధినకు తక
అనురాగ బిగినే చూసి అనుకోని అతిధొచ్చాడాయమ్మో
పరువాల ముంగిట్లోన పరదాలు తొలిగించాడాయొమ్మో
కన్నే నేనై ఉంటే కాటుక తానై పోయే
వెన్నెల మనతో ఉంటే వేకువ తానై వచ్చే
కలలోని అందమిది కంటపడిన పులకింతమ్మ పూసినవేళ
సుఖ వసంతాల చిరునవ్వే సఖి సరాగాల సిరి మువ్వై
తొలి పదారేళ్ళు అష్టపదులైన వేళ


హోయ్ హోయ్ హోయ్ హోయ్ గాలి ఈల వేసే
అమ్మా హోయ్ హోయ్ హోయ్ హోయ్ పైట పాట పాడే
చుక్కను చేర నెలవంకొచ్చే
చిలకను చేర గోరింకొచ్చే
ఏం కావాలో ఇంకేం చెయ్యాలో
నింగికి నేల నిచ్చెన వేసే
ఊరికి ఏరే వంతెన వేసే
ఏం చెయ్యాలో ఇంకేం చెయ్యాలో

చరణం2:

మెరుపుల్లో మేనరికాలు చూపుల్లో చుట్టరికాలై పోయే
మురిపాల ముద్దరికాలు ఎరుపుల్లో ఇల్లరికాలై పోయే
కన్ను తెరిస్తే వాడే వెన్ను విరిస్తే వాడే
పువ్వుకు తుమ్మెద వాడే పరువానికి పైయెద వాడే
ఎదురైన జాణ ఎదలోని వీణ కదిలించేటి కళ్యాణిలోన
వినిపించేనేదో తొలి కేక
ఎద లోతుల్లోకి చెలి రాక
చెలి వయ్యారాలు జీవ నదులైన వేళ

హోయ్ హోయ్ హోయ్ హోయ్ గాలి ఈల వేసే
అమ్మా హోయ్ హోయ్ హోయ్ హోయ్ పైట పాట పాడే
హోయ్ హోయ్ హోయ్ హోయ్ పాలపిట్ట కూసే
హల్లో హోయ్ హోయ్ హోయ్ హోయ్ కన్ను కాయకాసే
నా ఈడు విసిరింది నాకే సవాలు
ఊహల్లో జరిగాయిలే ఉత్సవాలు
తాంబూలాల పొద్దుల్లో తానేం తెస్తాడో
కన్నె చూపు చుక్క చుట్టాలయ్యే సాయంత్రాలో
హోయ్ హోయ్ హోయ్ హోయ్ గాలి ఈల వేసే
అమ్మా హోయ్ హోయ్ హోయ్ హోయ్ పైట పాట పాడే

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

No comments: