Sep 30, 2007

జరిగిన కధ

తారాగణం:జగ్గయ్య,కృష్ణ,కాంచన
గాత్రం:ఘంటసాల
సాహిత్యం:సి.నారాయణరెడ్డి
విడుదల:1969




పల్లవి:

భలే మంచి రోజు పసందైన రోజు
వసంతాలు పూచే నేటి రోజు ఆ ఆయ్
వసంతాలు పూచే నేటి రోజు

చరణం1:

గుండెలోని కోరికలన్ని గువ్వలుగా ఎగిసిన రోజు
గువ్వలైన ఆ కోరికలే గూటిలోన చేరిన రోజు
నింగి లోని అందాలన్ని ముంగిటిలోనే నిలిచిన రోజు

భలే మంచి రోజు పసందైన రోజు
వసంతాలు పూచే నేటి రోజు ఆ ఆయ్
వసంతాలు పూచే నేటి రోజు

చరణం2:

చందమామ అందిన రోజు బృందావని నవ్విన రోజు
తొలివలపులు చిలికిన రోజు
కుల దైవం పలికిన రోజు
చందమామ అందిన రోజు బృందావని నవ్విన రోజు
తొలివలపులు చిలికిన రోజు
కుల దైవం పలికిన రోజు
కన్న తల్లి ఆశలన్ని సన్న జాజులై విరిసిన రోజు

భలే మంచి రోజు పసందైన రోజు
వసంతాలు పూచే నేటి రోజు ఆ ఆయ్
వసంతాలు పూచే నేటి రోజు
ఆ ఆ అహహహ ఆ ఆ అహహహ ఆ ఆ అహహహ ఆ ఆ అహహహ

||

No comments: