తారాగణం:భానుచందర్,భానుప్రియ,రజని
గాత్రం:ఎస్.జానకి
సంగీతం:ఇళయరాజా
దర్శకత్వం:మోహన్ గాంధి
సంస్థ:లావణ్య ఆర్ట్స్
విడుదల:1986
పల్లవి:
లా లాల లల లాలా లాలాలలాల లలలల
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై
రామయ్య ఎదలో రాగాలమాలై పాడాలి నేను పాటని
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై
చరణం1:
నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ మనిషిక్కడ మనసక్కడ ఇన్నాలైనా
నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ మనిషిక్కడ మనసక్కడ ఇన్నాలైనా
నీ ఊసులనే నా ఆశలుగా నా ఊహలనే నీ బాసలుగా
అనుకొంటిని కలగంటిని నీఎదుట
నే కన్న కలలు నీ కళ్ళతోనే
నాకున్న తావు నీగుండెలోనె
కాదన్ననాడు నేనే లేను
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై
రామయ్య ఎదలో రాగాలమాలై పాదాలి నేను పాటని
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై
చరణం2:
నా వయసొక వాగైనది నా వలపొక వరదైనది నా మనసొక నావైనది ఆ వెల్లువలో
నా వయసొక వాగైనది నా వలపొక వరదైనది నా మనసొక నావైనది ఆ వెల్లువలో
ఈ వెల్లువలో ఎమవుతానో ఈ వేగంలో ఎటు పోతానో
ఈ నావకు నీ చేరువ తావున్నదో
తెరచాపనువ్వై నడిపించుతావో
దరిచేర్చి నన్ను ఒడి చేర్చుతావో
నట్టేటముంచి నవ్వేస్తావో
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై
రామయ్య ఎదలో రాగాలమాలై పాదాలి నేను పాటని
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై
వేచాను నీ రాకకై
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
పాట ఇక్కడ వినండి.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
1 comment:
thanks
I got that song
I am searching it for a long time .
Post a Comment