Oct 1, 2007

స్వర్ణకమలం



పల్లవి:


ఆకాశంలొ ఆశల హరివిల్లు
ఆనందాలే పూసిన పొదరిల్లు
అందమైన ఆ లోకం ఆందుకోనా
ఆదమరిచి కలకాలం ఉండిపోనా

ఆకాశంలొ ఆశల హరివిల్లు
ఆనందాలే పూసిన పొదరిల్లు

చరణం1:

మబ్బుల్లొ తూలుతున్న మెరుపైపొనా
వయారి వాన జల్లై దిగిరానా
సంద్రంలొ పొంగుతున్న అలనైపొనా
సందెల్లొ రంగులెన్నొ చిలికెనా
పిల్లగాలె పల్లకీగా
దిక్కులన్ని చుట్టిరానా
నా కొసం నవరాగాలీ నాట్యమాడెనుగా

ఆకాశంలొ ఆశల హరివిల్లు
ఆనందాలే పూసిన పొదరిల్లు

చరణం2:

స్వర్గాల స్వాగతాలు తెలిపే గీతం
స్వప్నాల సాగరాల సంగీతం
ముద్దొచ్చె తారలెన్నొ మెరిసే తీరం
ముత్యాల తోరణాల ముఖద్వారం
శొభలీలె సోయగానా చందమామా మందిరానా
నా కోసం సురభొగాలె వేచి నిలిచెనుగా

ఆకాశంలొ ఆశల హరివిల్లు
ఆనందాలే పూసిన పొదరిల్లు
అందమైన ఆ లోకం ఆందుకోనా
ఆదమరిచి కలకాలం ఉండిపోనా
ఆకాశంలొ ఆశల హరివిల్లు
ఆనందాలే పూసిన పొదరిల్లు

||

No comments: