తారాగణం:నాగేశ్వరరావు,జయసుధ,విక్రం,హరిష్,రాజ్ కుమార్,రంభ,యమున,దాసరి,సత్యనారాయణ
గాత్రం:బాలు,చిత్ర
సంగీతం:రాజ్-కోటి
దర్శకత్వం:దాసరి నారాయణరావు
విడుదల:1994
పల్లవి:
అమ్మంటే ప్రేమకు రూపం నాన్నంటే ఆమెకు దీపం
సతి అంటే సహకారం మగడంటే మమకారం
ఇల్లు స్వర్గసీమ ఇంటి పేరు ప్రేమ
ఇల్లు స్వర్గసీమ ఇంటి పేరు ప్రేమ
ఎన్నటిదో అనుబంధం ఎదనిండా మకరందం
అమ్మంటే ప్రేమకు రూపం నాన్నంటే ఆమెకు దీపం
చరణం1:
తోడు నీడ తోటలో తోటమాలి సేవలో పువ్వులారబోసుకున్న యవ్వనాలలో
ముద్దుచల్లార పెట్టుకున్న సిగ్గు
ఇల్లు తెల్లరి పెట్టుకున్న ముగ్గు
వాంఛ రెట్టింపు చేసుకున్న వద్దు
కొత్త దాంపత్యభవాలు దిద్దు
పాల మీద మల్లెపూలు పంచుకున్నా జీవితాలు ప్రేమలో ఓ ఓ ఓ
ఎన్నటిదో అనుబంధం ఎదనిండా మకరందం
అమ్మంటే ప్రేమకు రూపం నాన్నంటే ఆమెకు దీపం
చరణం2:
బాటసారి యాత్రలో బారసాల ఈ దినం కోకిలమ్మ పాడుతున్న జోలపాటలో
పుల్లమావిల్లు చీకెతెనే కన్నా
మల్లెపూలేమో ముళ్లు పక్కలోన
కల్పవృక్షాన్ని మిమ్ము కట్టుకున్న
వంశవృక్షాన్ని నేను పెంచుకున్న
జంటలైన పావురాలు కలలుకన్నకాపురాల జోరులో ఓ ఓ ఓ
ఎన్నటిదో అనుబంధం ఎదనిండా మకరందం
అమ్మంటే ప్రేమకు రూపం నాన్నంటే ఆమెకు దీపం
సతి అంటే సహకారం మగడంటే మమకారం
ఇల్లు స్వర్గసీమ ఇంటి పేరు ప్రేమ
ఇల్లు స్వర్గసీమ ఇంటి పేరు ప్రేమ
ఎన్నటిదో అనుబంధం ఎదనిండా మకరందం
అమ్మంటే ప్రేమకు రూపం నాన్నంటే ఆమెకు దీపం
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
No comments:
Post a Comment