Oct 9, 2007

బాలరాజు కధ

తారాగణం: మాష్టర్ ప్రభాకర్,నాగభుషణం,సూర్యకాంతం
గాత్రం: పి.సుశీల
సంగీతం: కెవి.మహదేవన్
దర్శకత్వం: బాపు
సంస్థ: హెచ్.ఎం.వి
విడుదల: 1970



పల్లవి:

మహాబలిపురం మహాబలిపురం మహాబలిపురం
భారతీయ కళాజగతికిది గొప్పగోపురం
కట్టించాడు ఈ ఊరు పల్లవరాజు
ఆ కధ చెప్పగ వచ్చాడు బాలరాజు
ఆ కధ చెప్పగ వచ్చాడు బాలరాజు
మహాబలిపురం మహాబలిపురం మహాబలిపురం
భారతీయ కళాజగతికిది గొప్పగోపురం
కట్టించాడు ఈ ఊరు పల్లవరాజు
ఆ కధ చెప్పగ వచ్చాడు బాలరాజు
ఆ కధ చెప్పగ వచ్చాడు బాలరాజు
మహాబలిపురం మహాబలిపురం మహాబలిపురం

చరణం1:

కంచి రాజధానిగా పాలించాడు
ఇది మంచిరేవు పట్టణంగా కట్టించాడు
కంచి రాజధానిగా పాలించాడు
ఇది మంచిరేవు పట్టణంగా కట్టించాడు
తెలుగుసీమ శిల్పుల్ని రప్పించాడు
తెలుగుసీమ శిల్పుల్ని రప్పించాడు
పెద్ద శిలలన్ని శిల్పాలుగా మార్పించాడు
మహాబలిపురం మహాబలిపురం మహాబలిపురం

చరణం2:

పాండవుల రధాలని పేరుపడ్డవి
ఏకాంతి శిలలనుండి మలచబడ్డవి
పాండవుల రధాలని పేరుపడ్డవి
ఏకాంతి శిలలనుండి మలచబడ్డవి
వీటి మీద బొమ్మలన్ని వాటమైనవి
వీటి మీద బొమ్మలన్ని వాటమైనవి
తాము సాటిలేని వాటిమంటు చాటుతున్నవి
తాము సాటిలేని వాటిమంటు చాటుతున్నవి
మహాబలిపురం మహాబలిపురం మహాబలిపురం

చరణం3:

మహిషాసుర మర్ధనం గోవర్ధనమెత్తటం
మహిషాసుర మర్ధనం గోవర్ధనమెత్తటం
మహావిష్ణు వరాహంగా అవతారం దాల్చటం
మహావిష్ణు వరాహంగా అవతారం దాల్చటం
పురాణాల ఘట్టాలు పొందుపర్చిరి
పురాణాల ఘట్టాలు పొందుపర్చిరి
ముచ్చటగా కన్నులకు విందునిచ్చిరి
మహాబలిపురం మహాబలిపురం మహాబలిపురం

చరణం4:

పాశుపతం కోరెను పార్ధుని మనసు
పరమశివుని కోసము చేసెను తపసు
పాశుపతం కోరెను పార్ధుని మనసు
పరమశివుని కోసము చేసెను తపసు
సృష్టంతా కదలివచ్చి చూడసాగెను
సృష్టంతా కదలివచ్చి చూడసాగెను
ప్రతి సృష్టి ఈ శిల్పమని పేరు వచ్చెను
ప్రతి సృష్టి ఈ శిల్పమని పేరు వచ్చెను
మహాబలిపురం మహాబలిపురం మహాబలిపురం

చరణం5:

సంద్రంలో కలసినవి కలసిపోయెను
ఒంటరిగా ఈ కోవెల మిగిలిపోయెను
సంద్రంలో కలసినవి కలసిపోయెను
ఒంటరిగా ఈ కోవెల మిగిలిపోయెను
దేవుని పాదాలను కెరటాలు కడుగును నిత్యం
పాదాలను కెరటాలు కడుగును నిత్యం
మనుషుల పాపాలు ఇవి కూడా తొలగును సత్యం సత్యం
పాపాలు ఇవి కూడా తొలగును సత్యం సత్యం


మహాబలిపురం మహాబలిపురం మహాబలిపురం
భారతీయ కళాజగతికిది గొప్పగోపురం
కట్టించాడు ఈ ఊరు పల్లవరాజు
ఆ కధ చెప్పగ వచ్చాడు బాలరాజు
ఆ కధ చెప్పగ వచ్చాడు బాలరాజు
మహాబలిపురం మహాబలిపురం మహాబలిపురం

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

No comments: