Oct 16, 2007
ముద్దమందారం
పల్లవి:
షొలాపూర్ చెప్పులు పోయాయి
నా షొలాపూర్ చెప్పులు పెళ్ళిలో పోయాయి
అవి కొత్తవి మెత్తవి కాలికి హత్తుకుపోయేవి
నా షొలాపూర్ చెప్పులు పెళ్ళిలో పోయాయి
అవి కొత్తవి మెత్తవి కాలికి హత్తుకుపోయేవి
నా షొలాపూర్ చెప్పులు పెళ్ళిలో పోయాయి
చరణం1:
రమణమూర్తి పెళ్ళి ఇది రాదు మళ్ళి మళ్ళి
నవ్వాలి తుళ్ళి తుళ్ళి అని పాడెను మళ్ళి మళ్ళి
రమణమూర్తి పెళ్ళి ఇది రాదు మళ్ళి మళ్ళి
నవ్వాలి తుళ్ళి తుళ్ళి అని పాడెను మళ్ళి మళ్ళి
ఆ సందట్లో కన్నేసి కనిపెట్టి కాజేసాడెవడో
నా షొలాపూర్ చెప్పులు పెళ్ళిలో పోయాయి
అవి కొత్తవి మెత్తవి కాలికి హత్తుకుపోయేవి
నా షొలా షొలా షొలా షొలాపూర్ చెప్పులు పెళ్ళిలో పోయాయి
చరణం2:
ఇది షొలాపూర్ లెదరు ఎన్వక్ ఏర్ ఫెదరు
సూటేస్తే ఎని వెదరు దీన్ని తొడిగి చూడు బ్రదరు
ఇది షొలాపూర్ లెదరు ఎన్వక్ ఏర్ ఫెదరు
సూటేస్తే ఎని వెదరు దీన్ని తొడిగి చూడు బ్రదరు
అని మురిపించి మరిపించి కొనిపించాడు ఆ పొట్టోడు
షొలాపూర్ చెప్పులు పెళ్ళిలో పోయాయి
అవి కొత్తవి మెత్తవి కాలికి హత్తుకుపోయేవి
నా షొలాపూర్ చెప్పులు పెళ్ళిలో పోయాయి
చరణం3:
జత నెంబరేమో ఆరు వెల చూస్తే ఇరవైఆరు
తొడిగేను ఒక్కమారు వెళ్ళాను పాత ఊరు
జత నెంబరేమో ఆరు వెల చూస్తే ఇరవైఆరు
తొడిగేను ఒక్కమారు వెళ్ళాను పాత ఊరు
ఒకసారైన పాలిష్ పట్టనిది కొట్టేసాడెవడో
నా షొలాపూర్ చెప్పులు పెళ్ళిలో పోయాయి
అవి కొత్తవి మెత్తవి కాలికి హత్తుకుపోయేవి
నా షొలాపూర్ చెప్పులు పెళ్ళిలో పోయాయి
నా షొలాపూర్ చెప్పులు పెళ్ళిలో పోయాయి
నా షొలాపూర్ చెప్పులు పెళ్ళిలో పోయాయి
దొరికితే ఎవరైనా ఇవ్వండి.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
Subscribe to:
Post Comments (Atom)
3 comments:
చాలా మంచి అభిరుచి వుందండీ మీకు. మీకు వీలయినప్పుడు ఈ పాటల్ని జత చేస్తే ఆనందిస్తాను.
1) ఏ మ్రోవిలో చేరితే గాలి గాంధర్వమౌతున్నదో
2) పలవించవా నా గొంతులో, పల్లవి కావా నా పాటలో...
3) జీవితం ప్రతిక్షణం సమరమై సాగనీ, గెలిచినా ఓడినా, గగనమే రగిలినా..
గుర్తొచ్చినప్పుడు మరిన్ని ఆడుగుతానేం!
ప్రసాదం
చాలా మంచి మంచి పాటలు రాస్తున్నారండి!! Thanks for sharing your work with us.
నెనర్లు ప్రసాదంగారు,
నెనర్లు నిషిగంధ గారు.
Post a Comment