గాత్రం:బాలు
దర్శకత్వం:బాలచందర్
విడుదల:1983
పల్లవి:
పల్లవించవా నా గొంతులో పల్లవి కావా నా పాటలో

ప్రణయసుధారాగా నా బ్రతుకు నీది కాదా

చరణం1:
నేనున్నది నీలోనే ఆ నేను నీవేనే నాదన్నది ఏమున్నది నాలో
నీవేనాడు మలిచావు ఈ రాతిని నేనీనాడు పలకాలి నీ గీతిని

ఇదే నాకు తపమని ఇదే నాకు వరమని
ఇదే నాకు తపమని ఇదే నాకు వరమని
చెప్పాలని వుంది గుండె విప్పాలని వుంది
చెప్పాలని వుంది గుండె విప్పాలని వుంది
పల్లవించవా నా గొంతులో పల్లవి కావా నా పాటలో
చరణం2:
నీ ప్రేమకు కలశాన్ని నీ పూజకు నిలయాన్ని నీ వీణకు నాదాన్ని కానా
నేనిన్నాళ్ళు చేసింది ఆరాధన నీకు ఈనాడు తెలిపేది నా వేదన

ఇదే నిన్ను వినమని ఇదే నిజం అనమని
ఇదే నిన్ను వినమని ఇదే నిజం అనమని
చెప్పాలని వుంది గుండె విప్పాలని వుంది
చెప్పాలని వుంది గుండె విప్పాలని వుంది
పల్లవించవా నా గొంతులో పల్లవి కావా నా పాటలో
ప్రణయసుధారాగా నా బ్రతుకు నీది కాదా
పల్లవించవా నా గొంతులో పల్లవి కావా నా పాటలో
ఈ పాట ఇక్కడ వినండి.
No comments:
Post a Comment