Oct 24, 2007

అంతులేని కధ

తారాగణం:జయప్రద,రజనికాంత్,కమల్ హాసన్,జయలక్ష్మి,నారాయణరావు
సాహిత్యం:ఆత్రేయ
గాత్రం:ఎస్.జానకి
సంగీతం:ఎం.ఎస్.విశ్వనాథ్
దర్శకత్వం:బాలచందర్
విడుదల:1976




పల్లవి:

కళ్ళలో ఉన్నదేదో కన్నులకే తెలుసు
కళ్ళలో ఉన్నదేదో కన్నులకే తెలుసు
రాళ్ళలో ఉన్న నీరు కళ్ళకెలా తెలుసు
రాళ్ళలో ఉన్న నీరు కళ్ళకెలా తెలుసు
నాలో ఉన్న మనసు నాకు కాక ఇంకెవరికి తెలుసు
కళ్ళలో ఉన్నదేదో కన్నులకే తెలుసు
రాళ్ళలో ఉన్న నీరు కళ్ళకెలా తెలుసు

చరణం1:

తానే మంటై వెలిగిస్తు దీపం
చెప్పదు తనలో చెలరేగు తాపం
నేవెళ్ళు దారి ఓ ముళ్ళదారి
నేవెళ్ళు దారి ఓ ముళ్ళదారి
రాలేరు ఎవరు నాతో చేరి
నాలో ఉన్న మనసు నాకు కాక ఇంకెవరికి తెలుసు

చరణం2:

వేసవిలోను వానలు రావా
కోవెల శిలకు జీవం రాదా
జరిగే నాడే జరుగును అన్ని
జరిగే నాడే జరుగును అన్ని
జరిగిన నాడే తెలియును కొన్ని
నాలో ఉన్న మనసు నాకు కాక ఇంకెవరికి తెలుసు


కళ్ళలో ఉన్నదేదో కన్నులకే తెలుసు
రాళ్ళలో ఉన్న నీరు కళ్ళకెలా తెలుసు
నాలో ఉన్న మనసు నాకు కాక ఇంకెవరికి తెలుసు

||

No comments: