Oct 30, 2007

మిస్సమ్మ

గాత్రం:ఏ.ఎం.రాజా

పల్లవి:

అవునంటే కాదనిలే కాదంటే అవుననిలే అవునంటే కాదనిలే కాదంటే అవుననిలే
ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే అర్ధాలే వేరులే అర్ధాలే వేరులే

చరణం1:

అలిగి తొలగి నిలిచినచో
అలిగి తొలగి నిలిచినచో చెలిమి జేయ రమ్మనిలే
చొరవ చేసి రమ్మనుచో
చొరవ చేసి రమ్మనుచో మరియాదగ పొమ్మనిలే

ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే అర్ధాలే వేరులే అర్ధాలే వేరులే

చరణం2:

విసిగి నసిగి కసిరినచో
విసిగి నసిగి కసిరినచో విషయమసలు ఇష్టములే
తరచి తరచి ఊసడిగిన
తరచి తరచి ఊసడిగిన సరసమింక చాలనిలే

||

No comments: