సాహిత్యం:దేవులపల్లి కృష్ణశాస్త్రి
పల్లవి:
ఎవరు ఏమని విందురు
ఎవ్వరేమని కందురు
ఈ జాలి గాధ ఈ విషాద గాధ
నెలరాజా వెన్నెల రాజా
నెలరాజా వెన్నెల రాజా
వినవా ఈ గాధ ఆ ఆ
నెలరాజా వెన్నెల రాజా
చరణం1:
ఏనాడో ఏకమై కలసిపోయిన జంట
ఏ కౄరదైవము ఎడబాటు చేసెనే ఏ ఏ
ఊరు గుడిలో రావి బావల
నాటి వలపుల మాటలన్ని
నేలపాలై పోయెనే ఏ ఏ
గాలిమేడలు కూలెనే
నెలరాజా వెన్నెల రాజా
వినవా ఈ గాధ ఆ ఆ
నెలరాజా వెన్నెల రాజా
చరణం2:
ఆ రావి ఆ బావి ఆ స్వామి సాక్షిగా ఆ ఆ
ఆనాటి బాసలు అన్ని కలలాయెనే ఏ ఏ ఏ
నడిచి వచ్చే వేళ తెలవని అడుగనైనా అడుగలేదని
ఎంతగా చింతించెనో ఏమనుచు దు:ఖించెనో
పొగిలి గుండెలు పగిలెనే
తుదకు భాదలు మిగెలెనే
నెలరాజా వెన్నెల రాజా
వినవా ఆ ఆ ఆ
నెలరాజా వెన్నెల రాజా
|
1 comment:
విహారి గారు! ఈ పాట ఆడియో దొరక పెట్టలేదా. మీక్కావాలంటె చెప్పండి ఎక్కడ దొరుకుతుందో చెప్తాను.
Post a Comment