తారాగణం:హరినాథ్,జమున,కుట్టి పద్మిని
గాత్రం:సుశీల
సంగీతం:ఎం.ఎస్.విశ్వనాథన్
దర్శకత్వం:ఆర్.క్రిష్ణన్,ఎస్.పంజు
నిర్మాత:ఏ.వి.మైయప్పన్
సంస్థ:ఏ.వి.ఎం.ప్రొడక్షన్స్
పల్లవి:
పిల్లలు దేవుడు చల్లని వారే
కల్లకపటమెరుగని కరుణామయులే
పిల్లలు దేవుడు చల్లని వారే
కల్లకపటమెరుగని కరుణామయులే
తప్పులు మన్నించుటే దేవుని సుగుణం
ఇది గొప్పవాళ్ళు చెప్పినట్టి చక్కని జ్ఞానం
తప్పులు మన్నించుటే దేవుని సుగుణం
ఇది గొప్పవాళ్ళు చెప్పినట్టి చక్కని జ్ఞానం
పిల్లలు దేవుడు చల్లని వారే
కల్లకపటమెరుగని కరుణామయులే
చరణం1:
పుట్టినపుడు మనిషి మనసు తెరచియుండును
పుట్టినపుడు మనిషి మనసు తెరచియుండును
ఆ పురుటి కందు మనసులో దైవముండును
ఆ పురుటి కందు మనసులో దైవముండును
వయసు పెరిగి ఈర్ష కలిగి మదము ఎక్కితే
వయసు పెరిగి ఈర్ష కలిగి మదము ఎక్కితే
అంత మనిషిలోని దేవుడే మాయమగునులే
అంత మనిషిలోని దేవుడే మాయమగునులే
పిల్లలు దేవుడు చల్లని వారే
కల్లకపటమెరుగని కరుణామయులే
చరణం2:
వెలుగుతున్న సూర్యున్ని మబ్బు మూయును
వెలుగుతున్న సూర్యున్ని మబ్బు మూయును
మనిషి తెలివియనే సూర్యున్ని కోపం మూయును
మనిషి తెలివియనే సూర్యున్ని కోపం మూయును
గాలి వీచ మబ్బు తెరలు కదలి పోవులే
గాలి వీచ మబ్బు తెరలు కదలి పోవులే
మాట కలుపుకున్న కోపమే చెలిమి అగునులే
మాట కలుపుకున్న కోపమే చెలిమి అగునులే
పిల్లలు దేవుడు చల్లని వారే
కల్లకపటమెరుగని కరుణామయులే
చరణం3:
పెరిగి పెరిగి పిల్లలే పెద్దలౌదురు
పెరిగి పెరిగి పిల్లలే పెద్దలౌదురు
ఆ పెద్దలేమో కలహిస్తే చిన్నబోదురు
ఆ పెద్దలేమో కలహిస్తే చిన్నబోదురు
మాయమర్మమేమి లేని బాలలందరు
మాయమర్మమేమి లేని బాలలందరు
ఈ భూమిపైన వెలసిన పుణ్యమూర్తులే
ఈ భూమిపైన వెలసిన పుణ్యమూర్తులే
పిల్లలు దేవుడు చల్లని వారే
కల్లకపటమెరుగని కరుణామయులే
తప్పులు మన్నించుటే దేవుని సుగుణం
ఇది గొప్పవాళ్ళు చెప్పినట్టి చక్కని జ్ఞానం
పిల్లలు దేవుడు చల్లని వారే
కల్లకపటమెరుగని కరుణామయులే
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
No comments:
Post a Comment