Oct 27, 2007

అప్పుచేసి పప్పుకూడు

గాత్రం:ఏ.ఎం.రాజా




పల్లవి:

మూగవైన ఏమిలే నగుమోమే చాలులే
సైగలింక చాలించుము జాణతనము తెలిసెనులే
మూగవైన ఏమిలే

చరణం1:

ఆపలేని అనురాగం చూపులలో తొణికెనులే
ఆపలేని అనురాగం చూపులలో తొణికెనులే
దొంగ మనసు దాగదులే
దొంగ మనసు దాగదులే సంగతెల్ల తెలిసెనులే
మూగవైన ఏమిలే

చరణం2:

పలుకకున్న ఏమాయెను వలపు బాసలింతేలే
పలుకకున్న ఏమాయెను వలపు బాసలింతేలే
నను దయతో ఏలుకొనుము
నను దయతో ఏలుకొనుము కనుసన్నల మెలిగెదలే
మూగవైన ఏమిలే

చరణం3:

అందాలే బంధాలై నను బందీ చేసెనులే
అందాలే బంధాలై నను బందీ చేసెనులే
కలవరమిక యెందుకులే
కలవరమిక యెందుకులే వలదన్నా వదలనులే

మూగవైన ఏమిలే నగుమోమే చాలులే
సైగలింక చాలించుము జాణతనము తెలిసెనులే
మూగవైన ఏమిలే

||

No comments: