Oct 27, 2007

సువర్ణసుందరి



పల్లవి:

పిలువకురా అలుగకురా నలుగురిలో నను ఓ రాజా
పలుచన సలుపకురా
పిలువకురా అలుగకురా నలుగురిలో నను ఓ రాజా
పలుచన సలుపకురా
పిలువకురా ఆ ఆ ఆ ఆ ఆ ఆ


చరణం1:

మనసున తాళి మరువనులేర
గలమున మోలి సలుపకు రాజా
సమయము కాదురా నిను దరిచేర
సమయము కాదురా నిను దరిచేర
కరుణను నన్నీవేళ మన్నించర రాజా
కరుణను నన్నీవేళ మన్నించర రాజా
పిలువకురా

చరణం2:

ఏలినవారి కొలువున గాని
మది నీరూపే మెదలినగాని
ఓయన లేనురా కదలగలేర
ఓయన లేనురా కదలగలేర
కరుణను నన్నీవేళ మన్నించర రాజా
కరుణను నన్నీవేళ మన్నించర రాజా

పిలువకురా అలుగకురా నలుగురిలో నను ఓ రాజా
పలుచన సలుపకురా

Get this widget | Track details | eSnips Social DNA

No comments: