Oct 27, 2007

బందిపోటు

తారాగణం:రామారావు,కృష్ణకుమారి
గాత్రం:ఘంటసాల,పి.సుశీల
నిర్మాత & దర్శకత్వం:బి.విఠలాచార్య
సంస్థ:రాజ్యలక్ష్మి ఆర్ట్ ప్రొడక్షన్స్
విడుదల:1963




పల్లవి:

ఊహలు గుస గుసలాడే
నా హృదయము ఊగిసలాడే ప్రియ ఉ
ఊహలు గుస గుసలాడే
నా హృదయము ఊగిసలాడే

చరణం1:

వలదన్న వినది మనసు కలనైన నిన్నె తలచు
వలదన్న వినది మనసు కలనైన నిన్నె తలచు
తొలి ప్రేమలో బలముందిలే అది నీకు ముందే తెలుసు
ఊహలు గుస గుసలాడే
నా హృదయము ఊగిసలాడే

చరణం2:

నను కోరి చేరిన బేల దూరన నిలిచే వేల
నను కోరి చేరిన బేల దూరన నిలిచే వేల
నీ ఆనతి లేకున్నచొ విడలేను ఊపిరి కూడ
ఊహలు గుస గుసలాడే
నా హృదయము ఊగిసలాడే

చరణం3:

దివి మల్లె పందిరి వేసే భువి పెళ్ళి పీటను వేసే
దివి మల్లె పందిరి వేసే భువి పెళ్ళి పీటను వేసే
నెర వెన్నెల కురిపించుచు నెలరాజు పెండ్లిని చెసె
ఊహలు గుస గుసలాడే
మన హృదయములూయలలూగే

||

No comments: