Oct 5, 2007

షావుకారు

తారాగణం:రామారావు,జానకి
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: సముద్రాల సీనియర్
గాత్రం: ఘంటసాల
దర్శకత్వం:ఎల్వి.ప్రసాద్
నిర్మాతలు:చక్రపాణి,నాగిరెడ్డి
సంస్థ:విజయ పిక్చర్స్
విడుదల:1950



పల్లవి:

ఏమనెనే ఏమనెనే చిన్నారి ఏమనెనే
ఏమనెనే
వన్నెల సిగ పూవ కను సన్నలలో భావమేమి
వన్నెల సిగ పూవ కను సన్నలలో భావమేమి
ఏమనెనే

చరణం1:

ఏమననే
ఆమని కోయిల పాటల
గోములు చిలికించు వలపు కిన్నెర
తానేమని రవళించెనే

ఏమనెనే చిన్నారి ఏమనెనే

చరణం2:

ఏమనెనే
వనరుగా చనువైన నెనరుగా
పలుకె బంగారమై కులుకె సింగారమై
మా వాద రాచిలుక మౌనమౌనముగా

ఏమనెనే చిన్నారి ఏమనెనే
వన్నెల సిగ పూవ కను సన్నలలో భావమేమి
వన్నెల సిగ పూవ కను సన్నలలో భావమేమి
ఏమనెనే ఏమనెనే చిన్నారి ఏమనెనే

||

No comments: