Oct 4, 2007

నిరీక్షణ




పల్లవి:

తియ్యని దానిమ్మ కొమ్మల్లో నంట
చిన్నారి పొన్నారి చిలకల్లజంట
చేస్తున్న కమ్మని కాపురము
చూస్తున్న కన్నుల సంబరము
ప్రేమకు మందిరము
తియ్యని దానిమ్మ కొమ్మల్లో నంట
చిన్నారి పొన్నారి చిలకల్లజంట
చేస్తున్న కమ్మని కాపురము
చూస్తున్న కన్నుల సంబరము
ప్రేమకు మందిరము
తియ్యని దానిమ్మ కొమ్మల్లో నంట
చిన్నారి పొన్నారి చిలకల్లజంట

చరణం1:

ఒక దేహం ఒక ప్రాణం తమ స్నేహంగ
సమ భావం సమ భాగం తమ పొందుగ
చిలకమ్మ నెయ్యాలే ఉయ్యాలగ
చెలికాని సరసాలే జంపాలగ
అనురాగం ఆనందం అందాలుగా
అందాల స్వప్నాలే స్వర్గాలుగ
ఎడబాసి మనలేని హృదయాలుగ
ముడిపడ్డ ఆ జంట తొలిసారిగ
గూడల్లుకోగా పుల్లల్లుతేగ
చెలికాడు ఎటకో పోగా అయ్యో పాపం వేచెను చిలకమ్మ
తియ్యని దానిమ్మ కొమ్మల్లో నంట
చిన్నారి పొన్నారి చిలకల్లజంట

చరణం2:

ఒకవేట గాడెందో వల పన్నగ
తిరుగాడు రాచిలక గమనించక
వలలోన పడితాను అల్లాడగ
చిలకమ్మ చెలికాని సడికానక
కన్నీరుమున్నీరై విలపించగ
ఇన్నాళ్ళ కలలన్ని కరిగించగ
ఎలుగెత్తి ప్రియురాలు రోదించగ
వినలేని ప్రియుడేమో తపియించగ
అడివంత నాడు ఆ జంట గోడు
వినలేక మూగై పోగా అయ్యో పాపం వేచెను చిలకమ్మ

తియ్యని దానిమ్మ కొమ్మల్లో నంట
చిన్నారి పొన్నారి చిలకల్లజంట
చేస్తున్న కమ్మని కాపురము
చూస్తున్న కన్నుల సంబరము
ప్రేమకు మందిరము
తియ్యని దానిమ్మ కొమ్మల్లో నంట
చిన్నారి పొన్నారి చిలకల్లజంట

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

పాట ఇక్కడ వినండి.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

No comments: