Oct 9, 2007

మేఘసందేశం

తారాగణం:నాగేశ్వరరావు,జగ్గయ్య,జయసుధ,జయప్రద
గాత్రం:ఏసుదాసు
సంగీతం:రమేష్ నాయుడు
నిర్మాత:దాసరి పద్మ
దర్శకత్వం:దాసరి నారాయణరావు
సంస్థ:తారకప్రభు ఫిలింస్
విడుదల:1983




పల్లవి:

ఆకాశదేశాన ఆషాఢమాసాన
మెరిసేటి ఓ మేఘమా మెరిసేటి ఓ మేఘమా
విరహమో దాహమో విడలేని మోహమో
వినిపించు నా చెలికి మేఘసందేశం మేఘసందేశం

చరణం1:

వానకారు కోయిలనై తెల్లవారి వెన్నెలనై
వానకారు కోయిలనై తెల్లవారి వెన్నెలనై
ఈ ఎడారి దారులలో ఎడద నేను పరిచానని
కడిమివోలే నిలిచానని
ఉరమని తరమని ఊసులతో ఉలిపిరి చినుకుల బాసలతో
విన్నవించు నా చెలికి విన్న వేదనా నా విరహ వేదనా
ఆకాశదేశాన ఆషాఢమాసాన
మెరిసేటి ఓ మేఘమా మెరిసేటి ఓ మేఘమా

చరణం2:

రాలుపూల తేనియకై రాతిపూల తుమ్మెదనై
రాలుపూల తేనియకై రాతిపూల తుమ్మెదనై
ఈ నిశీది నీడలలో నివురులాగ మిగిలానని
శిధిల జీవినైనానని
తొలకరి మెరుపుల లేఖలతో రుధిర భాష్ప జలధారలతో
ఆ అ అ అ అ అ అ అ
విన్నవించు నా చెలికి మనోవేదనా నా మరణయాతన
ఆకాశదేశాన ఆషాఢమాసాన
మెరిసేటి ఓ మేఘమా మెరిసేటి ఓ మేఘమా
విరహమో దాహమో విడలేని మోహమో
వినిపించు నా చెలికి మేఘసందేశం మేఘసందేశం

||

No comments: