Oct 31, 2007

బందిపోటు

గాత్రం:ఘంటసాల



పల్లవి:

ఒహొహొ ఓ ఒహొహొ ఓ ఒహొహొ ఓ ఓ ఓ
వగల రాణివి నీవే సొగసుకాడను నేనే
ఈడు కుదిరెను జోడు కుదిరెను మేడ దిగిరావే
వగల రాణివి నీవే సొగసుకాడను నేనే
ఈడు కుదిరెను జోడు కుదిరెను మేడ దిగిరావే
వగల రాణివి నీవే

చరణం1:

పిండి వెన్నెల నీకోసం పిల్లతెమ్మెర నాకోసం
పిండి వెన్నెల నీకోసం పిల్లతెమ్మెర నాకోసం
రెండు కలసిన నిండుపున్నమి రేయి మనకోసం
వగల రాణివి నీవే

ఒహొహొ ఓ ఒహొహొ ఓ ఒహొహొ ఓ ఓ ఓ
ఒహొహొ ఓ ఒహొహొ ఓ

చరణం2:

దోరవయసు చినదాన కోరచూపుల నెరజాణ
దోరవయసు చినదాన కోరచూపుల నెరజాణ
బెదరుటెందుకు కదలు ముందుకు ప్రియుడు నేగాన
వగల రాణివి నీవే

చరణం3:

కోపమంతా పైపైనే చూపులన్ని నాపైనే
కోపమంతా పైపైనే చూపులన్ని నాపైనే
వరుని కౌగిట ఒరిగినంత తరగపోదువులే

వగల రాణివి నీవే సొగసుకాడను నేనే
ఈడు కుదిరెను జోడు కుదిరెను తోడురారావే
వగల రాణివి నీవే
ఒహొహొ ఓ ఒహొహొ ఓ ఒహొహొ ఓ ఓ ఓ

||

No comments: