పల్లవి:
చిగురుల పూవుల సింగారముతో తీవెల సొంపులు గనలేదు
ముసిముసి నవ్వుల గిలిగింతలతో వసంత ఋతువా రానేలేదు
కాలం కాని కాలంలో కోయిల కూతలెందుకనో
తరుణం కాని తరుణంలో నా మది యీ గుబులెందుకనో
కాలం కాని కాలంలో కోయిల కూతలెందుకనో
చరణం1:
వలుపులు మీటగ తీయని పాటలు హృదయవీణపై పలికెనుగా
ప్రియతము గాంచిన ఆనందములో మనసే వసంత ఋతువాయెనుగా
కాలం కాని కాలంలో కోయిల కూతలందుకనే
తరుణం కాని తరుణంలో నీ మది ఆ గుబులందుకనే
కాలం కాని కాలంలో కోయిల కూతలందుకనే
చరణం2:
తళుకుబెళుకుళ తారామణులతో శారదరాత్రులు రాలేదు
ఆకాశంలో పకపకలాడుచు రాకాచంద్రుడు రానేలేదు
కాలం కాని కాలంలో చల్లని వెన్నెల ఎందుకనో
తరుణం కాని తరుణంలో నా మది యీ గుబులెందుకనో
కాలం కాని కాలంలో చల్లని వెన్నెల ఎందుకనో
చరణం3:
తలచిన తలపులు ఫలించగలవని బులపాటము బలమాయెనుగా
పగటి కల గను కన్యామణులను ప్రియుడే రాకాచంద్రుడుగా
కాలం కాని కాలంలో చల్లని వెన్నెల అందుకనే
తరుణం కాని తరుణంలో నీ మది యీ గుబులందుకనే
కాలం కాని కాలంలో చల్లని వెన్నెల అందుకనే
|
No comments:
Post a Comment