పల్లవి:
సాయి బాబా సాయి బాబా సాయి నాధా
సాయి దేవా సత్యం నిత్యం నీవే కావా
నువ్వు లేక అనాధలం బ్రతుకంతా అయోమయం
నువ్వు లేక అనాధలం బ్రతుకంతా అయోమయం
బాబా ఓ బాబా
ఇక నీ పరీక్షకు మేమాగలేము
ఇటులీ నీరీక్షణ మేమోర్వలేము
నువ్వు లేక అనాధలం బ్రతుకంతా అయోమయం
నువ్వు లేక అనాధలం బ్రతుకంతా అయోమయం
బాబా ఓ బాబా
చరణం1:
మా పాలి దైవం అని మా దిక్కు నీవేనని
కొలిచాము దినం దినం సాయి
మా ఆర్తి చూస్తావని సాక్షాత్కరిస్తావని
వేచాము క్షణం క్షణం సాయి
శ్రీరాముడైనా శ్రీకృష్ణుడైనా
ఏ దైవమైనా ఏ ధర్మమైనా
నీ లోనె చూచాము సాయి
రావా బాబా రావా రక్షా దక్షా నీవె కద మా బాబా
నువ్వు లేక అనాధలం బ్రతుకంతా అయోమయం
నువ్వు లేక అనాధలం బ్రతుకంతా అయోమయం
బాబా ఓ బాబా
చరణం2:
మా ఏసు నీవేనని మా ప్రభువు నీవేనని
ప్రార్ధనలు చేసామయ్య నిన్నే
అల్లాగ వచ్చావని చల్లంగ చూస్తావని
చేసాము సలాం సలాం నీకె
గురునానక్ అయినా గురు గోవిందైనా
గురుద్వారమైనా నీ ద్వారకేనని
నీ భక్తులైనాము సాయి
రావా బాబా రావా రక్షా దక్షా నీవే కదా మా బాబా
నువ్వు లేక అనాధలం బ్రతుకంతా అయోమయం
నువ్వు లేక అనాధలం బ్రతుకంతా అయోమయం
బాబా ఓ బాబా
ఇక నీ పరీక్షకు మేమాగలేము
ఇటు ఈ నీరీక్షణ మేమోర్వలేము
నువ్వు లేక అనాధలం బ్రతుకంతా అయోమయం
బాబా ఓ బాబా
కృష్ణ సాయి కృష్ణ సాయి రామ సాయి
కృష్ణ సాయి కృష్ణ సాయి రామ సాయి
అల్లా సాయి మౌలా సాయి
అల్లా సాయి మౌలా సాయి
నానక్ సాయి గోవింద్ సాయి ఏసు సాయి షిరిడి సాయి ఓం
నానక్ సాయి గోవింద్ సాయి ఏసు సాయి షిరిడి సాయి ఓం
సాయి సాయి బాబా సాయి
సాయి సాయి బాబా సాయి
సాయి సాయి బాబా సాయి
సాయి సాయి బాబా సాయి
ఓం
|
No comments:
Post a Comment