పల్లవి:
వెన్నెల్లో గోదారి అందం నది కన్నుల్లో కన్నీటి దీపం
వెన్నెల్లో గోదారి అందం నది కన్నుల్లో కన్నీటి దీపం
అది నిరుపేద నా గుండెలో చలి నిటూర్పు సుడిగుండమై
నాలో సాగే మౌనగీతం ఉం ఉం
వెన్నెల్లో గోదారి అందం నది కన్నుల్లో కన్నీటి దీపం
చరణం1:
జీవితవాహిని అలలై ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ అ అ అ
జీవితవాహిని అలలై ఊహకు ఊపిరి వలలై
భందనమై జీవితమే నిన్నటి చీకటి గదిలో
ఎడబాటే ఏ ఏ ఒక పాటై
పూలతీవెలో సుమవీణ మోగునా
వెన్నెల్లో గోదారి అందం నది కన్నుల్లో కన్నీటి దీపం
చరణం2:
నిన్నటి శరపంజరాలు దాటిన స్వరపంజరాన నిలచి
కన్నీరే పొంగి పొంగి తెరలచాటు నాచూపులు చూడలేని మంచుబొమ్మనై
యవ్వనాలు అదిమి అదిమి పువ్వులన్ని చిదిమి చిదిమి వెన్నెలంత ఏటిపాలు చేసుకుంటినే
నాకు లేదు మమకారం మనసు మీద అధికారం
నాకు లేదు మమకారం మనసు మీద అధికారం
ఆశలు మాసిన వేసవిలో ఆవేదనలూరేగిన ఆలాపన సాగే
మదిలో కలలే నదిలో వెల్లువులై పొంగారే
మనసు వయసు కరిగి స్మరించిన సరాగమే కలతను రేపిన వలపుల ఒడిలో
తిరిగే సుడులై ఎగసే ముగిసే కధ నేనా
ఎగసే ముగిసే కధ నేనా
|
No comments:
Post a Comment