సాహిత్యం:వేటూరి
పల్లవి:
తీగనై మల్లెలు పూచిన వేళ
ఆగనా అల్లనా పూజకో మాల
మనసు తెర తీసినా మోమాటమేనా
మమత కలబోసినా మాట కరువేనా
తీగనై మల్లెలు పూచిన వేళ
ఆగనా అల్లనా పూజకో మాల
చరణం1:
తెలిసి తెలియందా ఇది తెలియక జరిగిందా
ఎపుడో జరిగిందా అది ఇపుడే తెలిసిందా ఆ ఆ
ఆశ పడ్డ అందుతుందా అర్హతైనా వుందా
అందుకున్నా పొందికుందా పొత్తుకుదిరేదా
ప్రేమకన్న పాశముందా పెంచుకుంటే దోషమందా
పెంచుకుంటే తీరుతుందా పంచుకుంటే మరిచేదా
చరణం2:
కలలో మెదిలిందా ఇది కధలో చదివిందా ఆ ఆ
మెరుపై మెరిసిందా అది వలపై కురిసిందా
రాసివుంటే తప్పుతుందా తప్పు నీదౌనా
మారమంటే మారుతుందా మాసిపోతుందా
చేసుకున్న పున్నెముందా చేరుకొనే దారివుందా
చేదుకొనే చేయి వుందా చేయి చేయి కలిసేనా
తీగనై మల్లెలు పూచిన వేళ
ఆగనా అల్లనా పూజకో మాల
మనసు తెర తీసినా మోమాటమేనా
మమత కలబోసినా మాట కరువేనా
తీగనై మల్లెలు పూచిన వేళ
ఆగనా అల్లనా పూజకో మాల
|
1 comment:
మీకు అన్ని సినిమాలకు ఫోటోలు ఎలా దొరుకుతాయండీ...
scan చేస్తారా...
Post a Comment