సంగీతం:ఇళయరాజా
గాత్రం:యేసుదాసు
సాహిత్యం:రంగసామి పార్థసారథి
నిర్మాత:గోగినేని ప్రసాద్
దర్శకత్వం:కె.వాసు
విడుదల:1986
పల్లవి:
హే పాండురంగ హే పండరినాదా
శరణం శరణం శరణం
సాయి శరణం బాబా శరణు శరణం
సాయి చరణం గంగా యమున సంగమ సమానం
ఏ క్షేత్రమైన తీర్ధమైన సాయే
మా పాండురంగడు కరుణామయుడు సాయే
ఏ క్షేత్రమైన తీర్ధమైన సాయే
మా పాండురంగడు కరుణామయుడు సాయే
సాయి శరణం బాబా శరణు శరణం
సాయి చరణం గంగా యమున సంగమ సమానం
చరణం1:
విద్యా బుద్దులు వేడిన బాలకు అగుపించాడు విఘ్నేశ్వరుడై
పిల్లా పాపల కోరిన వారిని కరుణించాడు సర్వేశ్వరుడై
తిరగలి చక్రం తిప్పి వ్యాధిని అరికట్టాడు విష్ణురూపుడై
మహస్యా స్యామాకు మారుతిగాను మరి కొందరికి దత్తాత్రేయుడుగా
యద్భావం తద్భవతని దర్శనమిచ్చాడు
ధన్యుల చేసాడు
సాయి శరణం బాబా శరణు శరణం
సాయి చరణం గంగా యమున సంగమ సమానం
ఏ క్షేత్రమైన తీర్ధమైన సాయే
మా పాండురంగడు కరుణామయుడు సాయే
సాయి శరణం బాబా శరణు శరణం
సాయి చరణం గంగా యమున సంగమ సమానం
చరణం2:
పెనుతుఫాను తాకిడిలో అలమటించు దీనులను
ఆదరించే ప్రాణనాధ ధారుడై
అజ్ఞానము అలుముకొన్న అంధులను చేరదీసి
అసలు చూపు ఇచ్చినాడు వైద్యుడై
వీధి వీధి బిచమెత్తి వారి వారి పాపములను
పుచ్చుకొని మోక్షమిచు సిద్దుడై
పుచ్చుకొన్న పాపములను ప్రక్షాలన చేసుకొనెను
దౌత్య క్రియ సిద్దితో సిద్దుడై
అంగములను వేరు చెసి ఖండ యోగ సాధనలో
ఆత్మ శక్తి చాటినాడు సిద్దుడై
జీవ రాసులన్నిటికి సాయే శరణం
సాయే శరణం
దివ్య జ్ఞాన సాధనకు సాయే శరణం
సాయే శరణం
ఆస్తికులకు సాయే శరణం నాస్తికులకు సాయే శరణం
ఆస్తికులకు సాయే శరణం నాస్తికులకు సాయే శరణం
భక్తికి సాయే శరణం ముక్తికి సాయే శరణం
భక్తికి సాయే శరణం ముక్తికి సాయే శరణం
సాయి శరణం బాబా శరణు శరణం
సాయి చరణం గంగా యమున సంగమ సమానం
ఏ క్షేత్రమైన తీర్ధమైన సాయే
మా పాండురంగడు కరుణామయుడు సాయే
ఏ క్షేత్రమైన తీర్ధమైన సాయే
మా పాండురంగడు కరుణామయుడు సాయే
ఏ క్షేత్రమైన తీర్ధమైన సాయే
మా పాండురంగడు కరుణామయుడు సాయే
|
1 comment:
Aaradhana(chiranjeevi,suhasini) lo "Adi emaindi" mariyu "teegapai mallelu" Alage maro charitra lo "ye Teege poovunu" ,"bale bale magadivoi" paatalu dorikite prachurinchaglaru.
mundastu nenarulu
Post a Comment