గాత్రం:ఎస్ పి.శైలజ,బాలు
పల్లవి:
వేవేలా గోపెమ్మలా మువ్వ గోపాలుడే మా ముద్దు గోవిందుడే
మువ్వ గోపాలుడే మా ముద్దు గోవిందుడే
అహ అన్నుల మిన్నెల కన్నుల వెన్నెల వేణువులూదాడే మది వెన్నెలు దోచాడే
అహహ వేవేలా గోపెమ్మలా మువ్వ గోపాలుడే మా ముద్దు గోవిందుడే
చరణం1:
మన్ను తిన్న చిన్నవాడే నిన్ను కన్న వన్నెకాడె ఏ ఏ
మన్ను తిన్న చిన్నవాడే నిన్ను కన్న వన్నెకాడె
కన్న తోడు లేని వాడే కన్నె తోడు వున్నవాడె
మోహనాల వేణువూదే మోహనాంగుడితడేలే
మోహనము వేణువూదే మోహనంబుడితడేలే
చీరలన్ని దోచి దేహ చింతలన్ని తీర్చినాడే
పోతన్న కైతలన్ని పోతపోసుకున్నాడే మా మువ్వ గోపాలుడే మా ముద్దు గోవిందుడే
వేవేలా గోపెమ్మలా మువ్వ గోపాలుడే మా ముద్దు గోవిందుడే
చరణం2:
వేయి పేరులున్నవాడే వేల తీరులున్నవాడే
వేయి పేరులున్నవాడే వేల తీరులున్నవాడే
రాస లీలలాడినాడే రాయబారమేగినాడే
గీతార్ధ సారమిచ్చి గీతలెన్నొ మార్చేనే
గీతార్ధ సారమిచ్చి గీతలెన్నొ మార్చేనే
నీలమై నిఖిలమై కాలమై నిలిచాడే
వరదయ్య కాలాన వరదలై పొంగాడే మా మువ్వ గోపాలుడే మా ముద్దు గోవిందుడే
ఆ అహహ వేవేలా గోపెమ్మలా మువ్వ గోపాలుడే మా ముద్దు గోవిందుడే
అహ అన్నుల మిన్నెల కన్నుల వెన్నెల వేణువులూదాడే మది వెన్నెలు దోచాడే
అహ అన్నుల మిన్నెల కన్నుల వెన్నెల వేణువులూదాడే మది వెన్నెలు దోచాడే
ఆ అహహ వేవేలా గోపెమ్మలా మువ్వ గోపాలుడే మా ముద్దు గోవిందుడే
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
No comments:
Post a Comment