Nov 16, 2007

శృతిలయలు

గాత్రం:యేసుదాసు

పల్లవి:

తెలవారదేమో స్వామి తెలవారదేమో స్వామి
నీ తలపులమునకలో అలసిన దేవేరి అలమేలు మంగకు
తెలవారదేమో స్వామి
నీ తలపులమునకలో అలసిన దేవేరి అలమేలు మంగకు
తెలవారదేమో స్వామి

చరణం1:

చెలువమునేలగ చెంగట లేవని కలతకు నెలవై నిలచిన నెలతకు
చెలువమునేలగ చెంగట లేవని కలతకు నెలవై నిలచిన నెలతకు
కలల అలజడికి నిద్దురకరువై
కలల అలజడికి నిద్దురకరువై
అలసిన దేవేరి
అలసిన దేవేరి అలమేలు మంగకు తెలవారదేమో స్వామి

చరణం2:

మక్కువమీరగ అక్కున జేరిచి అంగజు కేలిమి పొంగుచు తేల్చగ
మక్కువమీరగ అక్కున జేరిచి అంగజు కేలిమి పొంగుచు తేల్చగ
ఆ మత్తునే మది మరి మరి తలచగ, మరి మరి తలచగ
అలసిన దేవేరి అలమేలు మంగకు తెలవారదేమో స్వామి
గామపని తెలవారదేమో సానిదపమపమగనిస గామ తెలవారదేమో స్వామి
పానిదపమగమ పసనిదపగమ పసనిరిసగరిమ తెలవారదేమో స్వామి

Get this widget | Track details | eSnips Social DNA

No comments: