Nov 18, 2007

కులగోత్రాలు

తారాగణం:కృష్ణకుమారి,నాగేశ్వరరావు,గుమ్మడి
గాత్రం:ఘంటసాల,సుశీల
సంగీతం:సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: సి.నారాయణరెడ్డి
నిర్మాత:అనుమోలు వెంకట సుబ్బారావు
దర్శకత్వం: కె. ప్రత్యగాత్మ
విడుదల: 1962



పల్లవి:

ఓ ఓ ఓ ఓ ఓ ఒ ఆ ఆ ఆ అ
చిలిపి కన్నుల తీయని చెలికాడ నీ నీడను నిలుపుకొందురా నిలుపుకొందురా వెలుగుల మేడా
నీలి కురుల వన్నెల జవరాలా నీ కౌగిట నిలుపుకొందునే పూల ఉయ్యాలా

చరణం1:

కనుల ముందు అలలు పొంగెను ఓ మనసులొన కలలు పండెను
కనుల ముందు అలలు పొంగెను ఓ మనసులొన కలలు పండెను
అలలే కలై, కలలే అలలై
అలలే కలై, కలలే అలలై
గిలిగింతలు సలుప సాగెను ఊ
చిలిపి కన్నుల తీయని చెలికాడ నీ నీడను నిలుపుకొందును రా వెలుగుల మేడా

చరణం2:

కొండలు ఓయి అని పిలిచినవి ఆ ఆ ఆ
గుండెలు హోయి అని పలికినవి ఆ ఆ ఆ
కొండలు ఓయి అని పిలిచినవి ఆ ఆ ఆ
గుండెలు హోయి అని పలికినవి
కోరికలు అన్ని బారులు తీరి
కోరికలు అన్ని బారులు తీరి గువ్వలు గా ఎరుగుతున్నవి
నీలి కురుల వన్నెల జవరాలా నీ కౌగిట నిలుపుకొందునే పూల ఉయ్యాలా

చరణం3:

జగము మరిచి ఆడుకుందుమా ఆ ఆ ఆ
ప్రణయ గీతి పాడుకుందుమా ఆ ఆ ఆ
జగము మరిచి ఆడుకుందుమా ఆ ఆ ఆ
ప్రణయ గీతి పాడుకుందుమా ఆ ఆ ఆ
నింగి నేల కలిసిన చోటా
నింగి నేల కలిసిన చోటా నీవు నేను చేరుకొందమా ఆ ఆ ఆ

చిలిపి కన్నుల తీయని చెలికాడ నీ నీడను నిలుపుకొందును రా వెలుగుల మేడా
ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ

||

No comments: