పల్లవి:
బ్రతుకంత భాదగా కలలోని గాధగా
కన్నీటిధారగా కరగిపోయె
తలచేది జరుగదు జరిగేది తెలియదు
బొమ్మను చేసి ప్రాణము పోసి ఆడేవు నీకిది వేడుకా
బొమ్మను చేసి ప్రాణము పోసి ఆడేవు నీకిది వేడుకా
గారడిచేసి గుండెను కోసి నవ్వేవు ఈ వింతచాలిక
బొమ్మను చేసి ప్రాణము పోసి ఆడేవు నీకిది వేడుకా
చరణం1:
అందాలు సృష్టించినావు దయతో నీవు
మరల నీచేతితో నీవే తుడిచేవులే
దీపాలు నీవే వెలిగించినావె
గాడాంధకారాన విడిచేవులే
కొండంత ఆశ అడియాశ చేసి
కొండంత ఆశ అడియాశ చేసి
పాతాళ లోకాన తోసేవులే
బొమ్మను చేసి ప్రాణము పోసి ఆడేవు నీకిది వేడుకా
చరణం2:
ఒకనాటి ఉద్యానవనము నేడు కనము
అదియే మరుభూమిగా నీవు మార్చేవులే
ఒకనాటి ఉద్యానవనము నేడు కనము
అదియే మరుభూమిగా నీవు మార్చేవులే
అనురాగమధువు అందించి నీవు హాలాహలజ్వాల చేసేవులే
ఆనందనౌక పయనించువేళ
ఆనందనౌక పయనించువేళ
లోకాల సంద్రాన ముంచేవులే
బొమ్మను చేసి ప్రాణము పోసి ఆడేవు నీకిది వేడుకా
గారడిచేసి గుండెను కోసి నవ్వేవు ఈ వింతచాలిక
బొమ్మను చేసి ప్రాణము పోసి ఆడేవు నీకిది వేడుకా
|
No comments:
Post a Comment