Nov 18, 2007

ఆత్మీయులు

తారాగణం:నాగేశ్వరరావు,వాణిశ్రీ,చంద్రమోహన్,చంద్రకళ
సంగీతం:సాలూరి రాజేశ్వరరావు
దర్శకత్వం:మధుసూధనరావు
నిర్మాత:మధుసూధనరావు
సంస్థ:అన్నపూర్ణ పిక్చర్స్,సారధి స్టూడియొస్
విడుదల:1969




పల్లవి:

కల్లలో పెళ్ళిపందిరి కనపడసాగె
పల్లకీలోన ఊరేగే ముహూర్తం మదిలో కదలాడె
కల్లలో పెళ్ళిపందిరి కనపడసాగె
పల్లకీలోన ఊరేగే ముహూర్తం మదిలో కదలాడె

చరణం1:

నుదుట కళ్యాణ తిలకముతో పసుపు పారాణి పదములతో
నుదుట కళ్యాణ తిలకముతో పసుపు పారాణి పదములతో
పెదవిపై మెదిలే నగవులతో వధువు నను ఓరగ చూస్తుంటే
జీవితాన పూలవాన

కల్లలో పెళ్ళిపందిరి కనపడసాగె
పల్లకీలోన ఊరేగే ముహూర్తం మదిలో కదలాడె

చరణం2:

సన్నాయి చల్లగా మ్రోగి పన్నీటి జల్లులే రేగి
సన్నాయి చల్లగా మ్రోగి పన్నీటి జల్లులే రేగి
మనసైన వరుడు దరి చేరి మెడలోన తాళి కడుతుంటే
జీవితాన పూలవాన

కల్లలో పెళ్ళిపందిరి కనపడసాగె
పల్లకీలోన ఊరేగే ముహూర్తం మదిలో కదలాడె

చరణం3:

వలపు హృదయాలు పులకించి మధుర స్వప్నాలు ఫలియించి
వలపు హృదయాలు పులకించి మధుర స్వప్నాలు ఫలియించి
లోకమే వెన్నెల వెలుగైతే భావియే నందనవనమైతే
జీవితాన పూలవాన

కల్లలో పెళ్ళిపందిరి కనపడసాగె
పల్లకీలోన ఊరేగే ముహూర్తం మదిలో కదలాడె
ఆహహ ఆహాహ ఆహహ ఆహాహ ఆహహ ఆహాహ

||

No comments: