Nov 23, 2007

మాయాబజార్

గాత్రం:ఘంటసాల,సావిత్రి
సాహిత్యం:పింగళి



పల్లవి:

సుందరి నీవంటి దివ్యస్వరూపము
ఎందెందు వెతికినా లేదుకదా
ఎందెందు వెతికినా లేదుకదా
నీ అందచందాలింక నావే కదా
సుందరి ఒహో సుందరి అహ సుందరి
నీవంటి దివ్యస్వరూపము
ఎందెందు వెతికినా లేదుకదా

చరణం1:

దూరం దూరం..ఆ
ఆ దూరమెందుకే చెలియా
వరియించి వచ్చిన ఆర్యపుత్రడనింక నేనే కదా ఆ
ఆ దూరమెందుకే చెలియా
వరియించి వచ్చిన ఆర్యపుత్రడనింక నేనే కదా
మన పెళ్ళి వేడుకలింక రేపే కదా అయ్యో
సుందరి ఒహో సుందరి అహ సుందరి
నీవంటి దివ్యస్వరూపము
ఎందెందు వెతికినా లేదుకదా
మన పెళ్ళి వేడుకలింక రేపే కదా
సుందరి ఒహో సుందరి అహ సుందరి

చరణం2:

రేపటిదాకా ఆగాలి ఆ
ఆగుమంటూ సఖియా అరమరలెందుకే
సోగసులన్ని నాకు నచ్చే కదా
ఆగుమంటూ సఖియా అరమరలెందుకే
సోగసులన్ని నాకు నచ్చే కదా
నీ వగలోనా విరహము హెచ్చే కదా
సుందరి ఒహో సుందరి అహ సుందరి
నీవంటి దివ్యస్వరూపము
ఎందెందు వెతికినా లేదుకదా
నీ వగలోనా విరహము హెచ్చే కదా
సుందరి ఒహో సుందరి అహ సుందరి

చరణం3:

హెచ్చితే ఎలా పెద్దలున్నారు
పెద్దలున్నారంటూ హద్దులెందుకే రమణి ఉం ఆ
పెద్దలున్నారంటూ హద్దులెందుకే రమణి
వద్దకు చేరిన పతినేకదా ఆ ఆ ఆ
పెద్దలున్నారంటూ హద్దులెందుకే రమణి
వద్దకు చేరిన పతినేకదా
నీ ముద్దుముచ్చటలింక నావే కదా
సుందరి నీవంటి దివ్యస్వరూపము
ఎందెందు వెతికినా లెదుకదా
నీ ముద్దుముచ్చటలింక నావే కదా
సుందరి అహ సుందరి ఒహొ సుందరి అహ సుందరి ఒహొ సుందరి ఒహొ సుందరి ఒహొ సుందరి ఒహొ సుందరి


||

No comments: