Nov 23, 2007

సప్తపది




పల్లవి:

రేపల్లియ ఎద ఝల్లున పొంగిన రవళి
నవరస మురళి ఆ నందన మురళి
ఇదేనా ఇదేనా ఆ మురళి మొహనమురళి
ఇదేనా ఆ మురళి
రేపల్లియ ఎద ఝల్లున పొంగిన రవళి
నవరస మురళి ఆ నందన మురళి
ఇదేనా ఆ మురళి మొహనమురళి
ఇదేనా ఆ మురళి

చరణం1:

కాళింది మడుగున కాళియును పడగల
ఆబాల గోపాల మాబాల గోపాలుని
కాళింది మడుగున కాళియును పడగల
ఆబాల గోపాల మాబాల గోపాలుని
అచ్చెరువున అచ్చెరువున విచ్చిన కన్నులజూడ
అచ్చెరువున అచ్చెరువున విచ్చిన కన్నులజూడ
తాండవమాడిన సరళి గుండెల మ్రోగిన మురళి
ఇదేనా ఇదేనా ఆ మురళి

చరణం2:

ఆ ఆ ఆ ఆ
అనగల రాగమై తొలుత వీనులలరించి
అనలేని రాగమై మరల వినిపించి మరులే కురిపించి
అనగల రాగమై తొలుత వీనులలరించి
అనలేని రాగమై మరల వినిపించి మరులే కురిపించి
జీవన రాగమై బృందావన గీతమై
ఆ ఆ జీవన రాగమై బృందావన గీతమై
కన్నుల కన్నుల కలువల వెన్నెల దోచిన మురళి
ఇదేనా ఇదేనా ఆ మురళి
ఆ ఆ ఆ వేణుగానలోలుని మురిపించిన రవళి నటనల సరళి ఆ నందనమురళి
ఇదేనా ఆ మురళి మువ్వల మురళి ఇదేనా ఆ మురళి

చరణం3:

మధురా నగరిలో యమునా లహరిలో ఆ రాధ ఆరాధనా గీతి పలికించి
మధురా నగరిలో యమునా లహరిలో ఆ రాధ ఆరాధనా గీతి పలికించి
సంగీత నాట్యాల సంగమ సుఖవేణువై
ఆ ఆ ఆ ఆ
సంగీత నాట్యాల సంగమ సుఖవేణువై
రాసలీలకే ఊపిరి పోసిన అందెలరవళి ఇదేనా
ఇదేనా ఆమురళి

రేపల్లియ ఎద ఝల్లున పొంగిన రవళి
నవరస మురళి ఆ నందన మురళి
ఇదేనా ఆ మురళి మొహనమురళి
ఇదేనా ఆ మురళి


||

No comments: