Nov 24, 2007
శ్రీనివాస కళ్యాణం
పల్లవి:
ఎందాక ఎగిరేవమ్మ గోరింక గోరింక
సందే వాలినాక గూటికి చేరుకోక
సందే వాలినాక గూటికి చేరుకోక
ఎందాక ఎగిరేవమ్మా గోరింక గోరింక
జోడు గువ్వ వాకిలి కాసి నీడలెక్కి చీకటి మూసి
పెందలాడె ఇంటికి చేరు పెత్తనాలు చాలు ఇంక
ఎందాక ఎందాక ఎగిరేవమ్మ గోరింక అహ గోరింక
చరణం1:
రాచకార్యమంటూ నువ్వు దేశమేలబోతే
వేగుచుక్క వెక్కిరింతలో కునుకైనా రాదే
మూసుకున్న రెప్పలవెనుకే చూసుకోవె నన్ను
పిల్లగాలి గుసగుస నేనై జోల పాడుతాను
ఎందుకులే దోబూచాట తొందరగా రావేమంట
కోరగానే తీరిపోతే కోరిక విలువేమిటంట
ఎందాక ఎందాక ఎగిరేవమ్మ గోరింక ఉహు హు గోరింక అహ హ
సందే వాలినాక గూటికి చేరుకోక
ఎందాక ఎగిరేవమ్మా గోరింక అహ గోరింక
చరణం2:
ఊసిపోని ఏకాంతంలో తోసిపోకు నన్ను
తోడులేని కలల బరువుతో ఈడు నేగలేను
దారం నీ చేతిని వున్న గాలిపటం నేను
దూరం ఎంతైనా గాని నిన్ను వీడిపోను
తీసుకుపో నీతో పాటే కాదంటే నా మీదొట్టే
తీసుకుపో నీతో పాటే కాదంటే నా మీదొట్టే
ఊరించే దూరం వుంటే అదో కమ్మదనమేనంట
ఎందాక ఎగిరేవమ్మా గోరింక అహ గోరింక
సందే వాలినాక గూటికి చేరుకోక
ఎందాక ఎగిరేవమ్మా గోరింక ఉహు హు అహ గోరింక అహ హ
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment