తారాగణం:రంగనాథ్,దీప,శ్రీధర్
గాత్రం:సుశీల. పి
సంగీతం:జి.కె.వెంకటేష్
సాహిత్యం:దేవులపల్లి కృష్ణశాస్త్రి
నిర్మాత:నవతా కృష్ణం రాజు
దర్శకత్వం:సింగీతం శ్రీనివాసరావు
విడుదల:1976
పల్లవి:
పాడనా తెలుగుపాట పాడనా తెలుగు పాట
పరవశనై మీ ఎదుట మీ పాట
పాడనా తెలుగు పాట
చరణం1:
కోవెల గంటల ఘణఘణలో గోదావరి తరగల గలగలలో
కోవెల గంటల ఘణఘణలో గోదావరి తరగల గలగలలో
మావులతోపుల మోపులపైనా మసలే గాలుల గుసగుసలో
మంచి ముత్యాల పేట మధురామృతాల తేట ఒక పాట
పాడనా తెలుగుపాట పాడనా తెలుగు పాట
పరవశనై నే పరవశనై మీ ఎదుట మీ పాట
పాడనా తెలుగు పాట
చరణం2:
త్యాగయ క్షేత్రయ రామదాసులు
త్యాగయ క్షేత్రయ రామదాసులు
తనివితీర వినిపించినది నాడు నాడులా కదిలించేది
వాడ వాడలా కనిపించెది
చక్కెర మాటల మూట చిక్కని తేనెల ఊట ఒక పాట
పాడనా తెలుగు పాట
చరణం3:
ఒళ్ళంత వయ్యారి కోక కళ్ళకు కాటుక రేఖ
ఒళ్ళంత వయ్యారి కోక కళ్ళకు కాటుక రేఖ
మెళ్ళో తాళి కాళ్ళకు పారాణి మెరిసే కుంకుమ బొట్టు
ఘల్లు ఘల్లున కడియాలందెలు అల్లనల్లన నడయాడె
తెలుగుతల్లి పెట్టని కోట తెనుగునాట ప్రతిచోట ఒక పాట
పాడనా తెలుగు పాట
No comments:
Post a Comment